Site icon NTV Telugu

Alleti Maheshwar Reddy : బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నా

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy : కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్‌ బిదురి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. రమేష్‌ బిదురి వ్యాఖ్యలకు నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలని యూత్‌ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్‌ కార్యకర్తలు హైదరాబాద్‌ నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసి, రమేష్‌ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు.

Formula E Car Race Case : కేటీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం

ఈ దాడిలో ఓ బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయాలపాలయ్యాడు. దీనికి ప్రతిగా, కోపోద్రికులైన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యకర్తలపై కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించడంతో, ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ శాసన సభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ.. బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నానన్నారు. బీజేపీ కార్యాలయం పై కాంగ్రెస్ దుండగులను పంపించి దాడులు చేశారని, కార్యకర్తల తలలు పగలగొట్టారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వ ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. ఏం చెప్పాలని అనుకుంటున్నారు.. ఏమిటి ఈ సంస్కృతి.. రాష్టానికి హోంమంత్రి లేరు.. సీఎం ఏం చెప్పాలని అనుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీసీసీ చీఫ్ దీనికి బాధ్యత వహించాలని, మహేష్ కుమార్ గౌడ్ వి చిల్లర చేష్టలు అని ఆయన ధ్వజమెత్తారు. దాడికి బాధ్యత వహించి మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చేయాలని, హోం మంత్రి సీఎం చేతుల్లో ఉంది ఆయన రాజీనామా చేస్తారా ? అని ఆయన దుయ్యబట్టారు. దీంతోపాటు.. ఫార్ములా ఈ రేసు కేసు గురించి మాట్లాడుతూ.. కేటీఆర్ అధికారుల ప్రమేయం ఉందని అంటున్నారని, అధికారులను కేటీఆర్ బెదిరించారన్నారు. కేటీఆర్ నిర్దోషి ఐతే నిలబడి ఎదుర్కోవాలని, వాస్తవాలను బయటపెట్టాలన్నారు. గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయన్నారు మహేశ్వర్‌ రెడ్డి.

Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ..

Exit mobile version