Alleti Maheshwar Reddy : బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నా
- కార్యకర్తల తలలు పగలగోట్టారు
- రాష్ట్రంలో అసలు ప్రభుత్వ ఉందా ?
- ఏం చెప్పాలని అనుకుంటున్నారు.. ఏమిటి ఈ సంస్కృతి : మహేశ్వర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. రమేష్ బిదురి వ్యాఖ్యలకు నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలని యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసి, రమేష్ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు.
Formula E Car Race Case : కేటీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం
Also Read
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
- UCC Bill: 'ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది'.. సీఎం సంచలన ప్రకటన..
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Pawan Kumar Chandana: మ్యాథ్స్‌లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
ఈ దాడిలో ఓ బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయాలపాలయ్యాడు. దీనికి ప్రతిగా, కోపోద్రికులైన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించడంతో, ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ శాసన సభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ.. బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నానన్నారు. బీజేపీ కార్యాలయం పై కాంగ్రెస్ దుండగులను పంపించి దాడులు చేశారని, కార్యకర్తల తలలు పగలగొట్టారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వ ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. ఏం చెప్పాలని అనుకుంటున్నారు.. ఏమిటి ఈ సంస్కృతి.. రాష్టానికి హోంమంత్రి లేరు.. సీఎం ఏం చెప్పాలని అనుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీసీసీ చీఫ్ దీనికి బాధ్యత వహించాలని, మహేష్ కుమార్ గౌడ్ వి చిల్లర చేష్టలు అని ఆయన ధ్వజమెత్తారు. దాడికి బాధ్యత వహించి మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చేయాలని, హోం మంత్రి సీఎం చేతుల్లో ఉంది ఆయన రాజీనామా చేస్తారా ? అని ఆయన దుయ్యబట్టారు. దీంతోపాటు.. ఫార్ములా ఈ రేసు కేసు గురించి మాట్లాడుతూ.. కేటీఆర్ అధికారుల ప్రమేయం ఉందని అంటున్నారని, అధికారులను కేటీఆర్ బెదిరించారన్నారు. కేటీఆర్ నిర్దోషి ఐతే నిలబడి ఎదుర్కోవాలని, వాస్తవాలను బయటపెట్టాలన్నారు. గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయన్నారు మహేశ్వర్ రెడ్డి.
Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ..
తాజావార్తలు
-
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
-
Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్‌తో సెకన్లలో పని పూర్తి!
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!