ఫార్ములా ఈ రేసు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేటీఆర్ క్యాష్ పిటిషన్ హైకోర్టు కొట్టి వేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. “ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. మా వాదన కూడా వినాలి”అని కేవియట్ పిటిషన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది.
READ MORE: Rajinikanth: రిపోర్టర్‌పై ‘సూపర్ స్టార్’ అసహనం!
ఇదిలా ఉండగా.. హై కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కేటీఆర్ అరెస్ట్‌పై స్టేను సైతం ఎత్తివేయడంతో టెన్షన్ పెరిగింది. దీంతో నంది నగర్ నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రి లీగల్ టీమ్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. హై కోర్టు ఫుల్ బెంచ్ వెళ్లాలా? సుప్రీంకోర్టుకు వెళ్లాలా? అనే దానిపై సమాలోచనలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందడుగు వేసింది.
READ MORE: Bandi Sanjay: బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే…పునాదులు కూడా మిగలవు!
మరోవైపు హై కోర్టు తీర్పుపై న్యాయవాదులతో మాట్లాడుతున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ.. “కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టారు. ఈ ఏడాదిలో అన్ని విషయాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అని సర్వే రిపోర్ట్ వచ్చింది. అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్ పై కేసు పెట్టారు. కుట్ర తో చేస్తున్నారు అని క్లియర్ గా తెలుస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నోటీస్ ఇచ్చినందుకు కేటీఆర్ విచారణకు వెళ్లారు. ప్రభుత్వం తీరు బాగా లేదు అని న్యాయవాదులతో కలిసి వెళ్తాను అన్నారు. అరగంట సేపు రోడ్డు మీదనే ఉన్నారు. కేటీఆర్ మళ్ళీ విచారణకు వెళ్తాడు కక్ష సాధింపునకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. ఇది కుట్రపూరితంగా పెట్టారు. ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి.. కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు.” అని హరీశ్ రావు పేర్కొన్నారు.