డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో నాటు కోళ్లకు బర్డ్ ప్లూ సోకింది. సుమారు 95 గ్రామాలలో బర్డ్ ఫ్లూతో నాటు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత 15 రోజుల నుంచి నాటుకోళ్లు బర్డ్ ప్లూతో పిట్టల్లా రాలిపోతున్నాయి. కోళ్లు చనిపోవడంతో నాటుకోళ్ల పెంపకం దారులకు లక్షల్లో నష్టం వాటిల్లుతుంది. దీంతో నాటుకోళ్ల వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
మొన్నటివరకు ఫారం, బ్రాయిలర్ కోళ్లకు వైరస్ సోకి మృతి చెందాయని ఆందోళన పడుతుంటే.. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వైరస్ నాటుకోళ్లుకు కూడా సోకింది. బర్డ్ ఫ్లూ వైరస్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం రేపుతుంది. ఫారం, బ్రయాలర్ కోళ్లకు వైరస్ సోకిందని.. రేటు ఎక్కువైనా నాటుకోళ్లు కొనుగోళ్లకు చికెన్ ప్రియులు మక్కువ చూపారు. మొన్నటి వరకు వేలు ఖర్చు పెట్టి నాటుకోళ్లును చికిన్ ప్రియులు కొనుగోలు చేశారు. దీనితో నాటుకోళ్లు వ్యాపారులు రేట్లు పెంచారు. నాటుకోళ్లుకు వైరస్ సోకి మృత్యువాత పడటంతో వ్యాపారులు లబోదిబో అంటున్నారు.
ఒక కోడిని పెంచడానికి పిల్ల దశ నుండి సంవత్సర కాలం పాటు బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, మేతలు వేసి పెంచుతామని వ్యాపారులు అంటున్నారు. వైరస్ సోకడంతో సుమారు 40 కోళ్లు చనిపోయాయని ఓ కోళ్ల వ్యాపారి ఆందోళన చెందుతున్నాడు. వైరస్ వల్ల కోళ్లు చనిపోవడంతో సుమారు రూ.5 లక్షల మేర నష్టపోయామని నాటుకోళ్ల పెంపకం దారుడు కోటేశ్వరరావు చెబుతున్నారు. నాటు
కోళ్లకు కూడా వైరస్ సోకకుండా ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కోటేశ్వరరావు కోరుతున్నారు.