Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా చివరి వారంలోకి ప్రవేశించడంతో, ఫిబ్రవరి 26న ముగియనున్న ఈ మహోత్సవానికి మరో అద్భుతమైన ఖగోళ ఘట్టం తోడవ్వనుంది. ఫిబ్రవరి 28న సౌర మండలంలోని ఏడు గ్రహాలన్నీ ఒకేసారి రాత్రి ఆకాశంలో ప్రత్యక్షమయ్యే అరుదైన దృశ్యం మనకు కనువిందు చేయనుంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపై రానున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. రాత్రి సమయంలో భారతదేశం…