అలియా భట్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటన తో బాలీవుడ్ ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది.నటి గా మంచి గుర్తింపును కూడా పొందింది.ఈమె రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది.. ఇలా తెలుగులో మొదటి సినిమాతో నే మంచి సక్సెస్ అందుకున్నఈ భామ తెలుగు లో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలైన తరువాత అలియా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా కూడా తెలుగు లో విడుదల అయింది.ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత అలియా భట్ ప్రియుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది.పెళ్లైన ఏడాది కే బిడ్డకు జన్మనివ్వడం తో అలియా సినిమాల కు కాస్త దూరంగా ఉన్నారు.
ప్రస్తుతం తన కుమార్తె రాహా భాద్యత చూసుకుంటూనే మరోవైపు సినిమా ఇండస్ట్రీ లో బిజీగా గడుపుతున్నారు. రణ్ వీర్ సింగ్,అలియా భట్ జంటగా నటించిన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ జూలై 28 న విడుదల కాబోతుంది.ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యం లో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అలియా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉంది.అందులో తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు అలియాభట్.ఈ క్రమంలో నే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అలియా కు తన కుమార్తె రాహ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ క్రమంలోనే తన కుమార్తె గురించి అలియా మాట్లాడుతూ నా కూతురు కూడా నాలా హీరోయిన్ అవ్వాలని నేను కోరుకువడం లేదు..తాను హీరోయిన్ గా కాకుండా భవిష్యత్ లో మంచి సైంటిస్ట్ గా పేరు సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నానని తెలియజేసింది.ప్రస్తుతం అలియా చేసిన ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి