నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సనాతన ధర్మం, హిందుత్వం, దేశభక్తి వంటి అంశాలను బలంగా ప్రస్తావిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా బాలకృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘అఖండ 2’ సక్సెస్ మీట్ వేదికగా దర్శకుడు బోయపాటి శ్రీను చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read : Rukmini Vasanth : బాలీవుడ్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న..
“ప్రధాని మోడీ గారు ‘అఖండ 2’ గురించి విన్నారు, సినిమాపై ఆసక్తి చూపించారు. త్వరలోనే ఢిల్లీలో ఈ సినిమాకు ప్రత్యేక ప్రదర్శన (స్పెషల్ షో) ఏర్పాటు చేస్తున్నాం. ఆ షోను మోడీ గారు కూడా చూడబోతున్నారు” అని తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది. దేశ అత్యున్నత నాయకుడు ఒక ప్రాంతీయ సినిమాను ప్రత్యేకంగా వీక్షించనున్నారన్న విషయం ‘అఖండ 2’ టీమ్‌కు మాత్రమే కాకుండా, మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతే కాదు “ఈ విజయం అంతా దైవ సంకల్పమే. ధర్మాన్ని నమ్మిన దేశాలు ఒకలా ఉంటాయి, నమ్మని దేశాలు మరోలా ఉంటాయి” అని వ్యాఖ్యానించారు బోయపాటి. త్వరలోనే ఢిల్లీలో జరగనున్న స్పెషల్ షో తేదీని అధికారికంగా ప్రకటిస్తామని కూడా ఆయన తెలిపారు. మొత్తానికి ‘అఖండ 2’ బాక్సాఫీస్ విజయంతో పాటు, ప్రధాని మోడీ స్పెషల్ షో వార్తతో మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం గా మారుతోంది. ఈ పరిణామం సినిమాకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చిందని, రాబోయే రోజుల్లో ‘అఖండ 2’ క్రేజ్ ఇంకా పెరగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.