కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వరుసగా ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేశారు.. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పోస్టులపై ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు పదో తరగతి పూర్తి చేస్తే సరిపోతుంది. పదో తరగతి అర్హతతో చెన్నై విమానాశ్రయంలో 105 ట్రాలీ రిట్రీవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపటి నుంచి ఆగస్టు 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు… ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని అనుకొనేవారికి వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. ఈ వయస్సు ఆగస్టు 1, 2023 వరకు లెక్కిస్తారు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థుల కు ఐదేళ్లు వయో సడలింపు కల్పించారు..
ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారు దరఖాస్తు ఫీ రూ.250గా చెల్లించాలి.. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఎలాంటి రాత పరీక్ష లేకపోయినప్పటికీ దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు చెన్నైలో పనిచేయాల్సి ఉంటుంది. నెలకు రూ.21,300 ల చొప్పున వేతనంగా చెల్లించనున్నారు.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరింత వివరాలను తెలుసుకొనేందుకు వెబ్ సైట్ https://aaiclas-ecom.org/live/Career.aspx ను సందర్శించొచ్చు. గతంలో కూడా ఎన్నో నోటిఫికేషన్ లను విడుదల చేశారు వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని నిపుణులు చెబుతున్నారు..