వన్డే ప్రపంచకప్-2023లో ఆఫ్గానిస్తాన్ మరో విక్టరీ సాధించింది. లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆఫ్గాన్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 179 పరుగులు చేసింది. ఈ క్రమంలో 180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ షాహిదీ 56 నాటౌట్ పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రెహమత్ షా 52 పరుగులతో రాణించాడు.