తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. ఏసీబీ అధికారులు మారువేషాల్లో వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. లారీ డ్రైవర్లుగా వేషం మార్చుకుని చెక్పోస్ట్ల దగ్గర తనిఖీలు చేపట్టారు. ఏక కాలంలో ఉమ్మడి పది జిల్లాల పరిధిలోని చెక్ పోస్టులలో తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 12 సంవత్సరాల తరువాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్ నిర్వహిస్తోంది.