తిరుమలలో వరుస అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస వైఫల్యాలతో టీటీడీ నిఘా విభాగం సతమతం అవుతోంది. డ్రోన్ కలకలం నుంచి, హజ్రత్ డ్రెస్, క్యాప్‌తో తిరుమలకు ముస్లిం వ్యక్తి అలిపిరి టోల్ గేట్‌లో ప్రవేశించే వరకు అనేక ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.
కోకాపేట్ సర్వీస్ రోడ్డులో బైక్ డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో.. బైక్ పై వెళ్తున్న విద్యార్థి స్వాత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.
ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో మరో యువతి బలి అయింది. ర్యాష్ డ్రైవింగ్ ఓ ప్రాణాన్ని మింగేసింది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పరిధిలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీటెక్ స్టూడెంట్ శివాని (21) అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ పై వెళ్తుండగా స్కోడా కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి.
సంగారెడ్డిలో అధికారులు రూల్స్ అతిక్రమిస్తున్నారు. వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి లైన్‌లో పెట్టాల్సిన అధికారులే రూల్స్ తప్పుతున్నారు. ఓవర్ స్పీడ్‌తో వెళ్లడమే కాకుండా.. ట్రాఫిక్ చలాన్లను ఎగ్గొడుతున్నారు. ఈ వ్యవహారం సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు.. సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ వరకు ఇదే తీరుతో వ్యవహరిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బైక్ రైడర్స్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఫ్లెక్సీలు, బోర్డింగ్ లు పెట్టి మరీ ప్రచారం చేసినా పట్టించుకోవడం లేదు. కంటి ముందు ప్రమాదాలు జరుగుతున్న పక్కనపెట్టి తమ ఆనందంకోసం బైక్ పై స్టంట్ లు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
ప్రైవేట్ బస్సులను ఆశ్రయించకండి.. ఆర్టీసీ ప్రయాణం.. సురక్షితం అంటూ ప్రచారం చేస్తారు అధికారులు.. అసలే బస్సు ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నాడు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని గమ్యానికి చేరుకుంటామే..? లేదో..? కూడా తెలియని పరిస్థితి.. దీంతో.. ఆ బస్సును నడుపుతోన్న డ్రైవర్‌ను మందలించారు ప్రయాణికులు.. అయితే, ప్రయాణికులు మందలించడాన్ని జీర్ణించుకోలేకపోయపోయిన సదరు ఆర్టీసీ డ్రైవర్.. అర్ధరాత్రి.. మార్గం మధ్యలో బస్సును వదిలేసి వెళ్లిపోయారు.. ఎంతకీరాకపోవడంతో.. ఆందోళనకు గురైన అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. Read Also: Nizamabad:…
మద్యం మత్తులో యవకులు వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. రోడ్డుపై రాష్ డ్రైవింగ్ చేస్తూ కొంతమంది అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. మరికొందరిని ఆస్పత్రుల పాలు చేస్తున్నారు. హైదరాబాద్ కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో యువకుల వీరంగం చేశారు. కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్ 3లో కొంతమంది యువకులు హడావిడి చేశారు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ భయబ్రాంతులకు గురి చేశారా యువకులు. అంతేకాకుండా, హాస్టల్ అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు యువకులు.…
బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విజయవాడ పోలీసులకు పట్టుబడ్డ తన అనుచరులను విడిపించుకునేందుకు అర్దరాత్రి సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఎంపీ సమక్షంలోనే ఆయన అనుచరులు పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఆయన అనుచరుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. విజయవాడలో నిన్న అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…