Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం యావత్ దేశాన్ని బాధించింది. భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరొందిన మన్మోహన్ సింగ్ మరణంపై దేశంలోని ప్రముఖ నాయకులతో పాటు, ప్రపంచదేశాధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన అంత్యక్రియలకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ హాజరయ్యారు. అంతకుముందు భూటాన్ రాజధాని థింఫులోని బౌద్ధ ఆశ్రమంలో మన్మోహన్ సింగ్ కోసం ప్రార్థనలు నిర్వహించారు.
Read Also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్.. ఇది వారి బాధ్యతే అన్న డిప్యూటీ సీఎం
భూటాన్ ప్రభుత్వం ప్రకారం… భూటాన్‌ని మొత్తం 20 జిల్లాల్లో భారత మాజీ ప్రధాని కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భూటాన్ జాతీయ జెండాను దేశవ్యాప్తంగా, రాయబార కార్యాలయాలు, విదేశాల్లో ఉన్న కాన్సులేట్ల వద్ద అవనతం చేశారు. రాజు నేతృత్వంలోని తాషిచోడ్‌జోంగ్‌లోని థింపూస్ కున్రేలో జరిగిన వేడుకలో 1000 దీపాలను వెలిగించారు. ఈ ప్రార్థనల్లో ప్రధాని షేరింగ్ టోబ్‌గే, భారత రాయబారి సుధాకర్ దలేలా, పలువురు రాజకుటుంబ సభ్యులు, భూటాన్ ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో భూటాన్ రాజు వాంగ్‌చుక్ పాల్గొన్నారు. మాజీ ప్రధానికి ఘనంగా నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో భూటాన్‌తో సహా అనేక కీలక దేశాలతో భారత సంబంధాలు గణనీయంగా పెరిగాయి. ఈయన హయాంలోనే 1949 నాటి ‘‘స్నేహ సహకార ఒప్పందం’’ 2007లో పునరుద్ధరించబడింది.