నడిరోడ్డుపై ఓ యువతిని జుట్టుపట్టుకొని కొట్టి, బట్టలు చింపి దారుణంగా ప్రవర్తించాడు ఓ స్పా యజమాని. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది ఈ ఘటన. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని స్థానికి స్పా గ్యాలక్సీ యజమాని మొహ్సిన్ గా గుర్తించారు. ఆ యువతిని అతని బిజినెస్ పార్టనర్ గా గుర్తించారు. 24 ఏళ్ల యువతిపై అతడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. చెంపపై కొడుతూ, జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువచ్చి దారుణంగా హింసించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
Also Read: Share Wale Baba: ఈయన అవతారం చూసి మోసపోకండి.. రూ.100 కోట్ల షేర్లకు అధిపతి
వివరాల ప్రకారం మొహ్సిన్ అనే వ్యక్తి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గ్యాలక్సీ పేరుతో ఓ స్పా నడుపుతున్నాడు. 24 ఏళ్ల యువతి అతడికి వ్యాపార భాగస్వామిగా ఉంది. వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఇరువురు గొడవ పడ్డారు. మొహ్సిన్ యువతిని కొట్టగా మొదట్లో ఆమె అతడిని నెట్టేసింది. తరువాత ఏదో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోబోయింది. అయినా మొహ్సిన్ ఆమె వెంట పడి తీసుకువచ్చి చెంపపై కొట్టడం మొదలు పెడతాడు. ఇంతలో అతడి స్నేహితుడు వచ్చి వద్దంటూ వారిస్తాడు.
మొహ్సిన్ అతనిపై అరవడంతో అక్కడి నుంచి కొంచెం దూరం వెళతాడు. మళ్లీ ఆ వ్యక్తి యువతిని బలవంతంగా జుట్టుపట్టుకొని లాక్కొచ్చి, రోడ్డుపై ఈడ్చుకుంటూతీసుకువచ్చి నడిరోడ్డు పై కొడుతూ ఉంటాడు. మొదట్లో అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన యువతి తరువాత ప్రతిఘటించలేకపోవడం మనం వీడియోలో చూడవచ్చు. తరువాత అతడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాడి జరిగి రెండు రోజులు అవుతున్న ఆ యువతి అతడిపై ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదు. వీడియో వైరల్ కావడంతో పోలీసుల స్పా యజమానిని అరెస్ట్ చేయబోగా అతడు ప్రస్తుతం పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్లు ఏం జరిగినా ఆడవారి పట్ల అలా ప్రవర్తించడం తప్పు అంటూ ఫైర్ అవుతున్నారు.
In Ahmedabad, a spa owner Mohsin brutally beat a woman, his act was recorded in CCTV..
It’s too painful to watch…Do such people deserve to live in our society?
But since his name is Mohsin, it won’t bother so called feminists/liberals.. there won’t be any outrage! pic.twitter.com/yppnTmgBDC
— Mr Sinha (@MrSinha_) September 27, 2023