భారత హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. గురువారం చెన్నైలో ఆయన కన్నుమూశారు. 98 యేళ్ల వయసులో ఆయన మరణించారు. ఆయన మొక్కలపై, వ్యవసాయం రంగంపై వివిధ పరిశోధనలు చేశారు. ఆయన విధానాలు, కొత్త వంగడాలు, గోధుమలో కొత్త రకాలను, హైబ్రిడ్ రకాలను కనుగోవడం ద్వారా భారత దేశం 1960 నాటి కరువు పరిస్థితులను ఎదుర్కోగలిగింది. భారత వ్యవసాయ రంగంలో ఆయన చెదరని ముద్రవేశారు. ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగింది అంటే దాని వెనుక ఆయన కృషి ఎంతో ఉంది.
Also Read: Ismart Shankar 2: డబుల్ ఇస్మార్ట్-సంజూ బాబా-పూరి… కాంబినేషన్ అదిరింది
వ్యవసాయ రంగంలో ఆయన చేసిన సేవకు గాను ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఆయనను వరించాయి. 1971లో ఆయనకు రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. ఇక 1986లో ఆయన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు దక్కించుకున్నారు. మొదటి ప్రపంచ ఆహార బహుమతిని 1987లో దీంతో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులు గౌరవాలను అందుకున్నారు. ఇక 1991లో ఎన్విరాన్‌మెంటల్ అచీవ్‌మెంట్ బహుమతి, ఇంటర్నేషనల్ జియోగ్రాఫికల్ యూనియన్ ప్లానెట్ అండ్ హ్యుమానిటీ మెడల్ కూడా ఆయన పొందారు. ఇక జాతీయంగా భారతదేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అందుకున్నారు. అలాగే హెచ్‌కే ఫిరోడియా అవార్డు, లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డు, ఇందిరాగాంధీ పురస్కారం కూడా స్వామినాధన్ కు లభించాయి.