వేగంగా దూసుకువచ్చిన కారు ఢీకొనడంతో మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్. ఆర్. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవరింగ్ చేస్తూ.. ఈనెల 24వ తేదీన దీపావళి పండుగ రోజు ఇంటి బయట నిల్చున్న గృహిణిని అతి వేగంగా వచ్చి కారుతో ఢీ కొట్టాడు. దీంతో.. తీవ్రంగా మహిళ గాయపడింది. అయితే.. కారు నడిపిన 17 సంవత్సరాల బాలుడి తో పాటు కారు యజమాని పై కేసు నమోదు చేశారు పోలీసులు. బెంగుళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చైతన్య వెంకటేష్ వెంకట్ దీపావళి సందర్భంగా తన భార్య నిత్య(35) ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణనగర్ లోని శ్రీనిలయం అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్న సోదరి ఇంటికి వచ్చాడు.
Also Read : US Startup competition : యుఎస్ స్టార్టప్ యుద్దభూమి పోటీలో సత్తాచాటిన డాక్టర్ షీబా
సోమవారం రాత్రి 7.45 గంటలకు కుటుంబ సభ్యులంతా ఇంటి ముందు బాణాసంచా కాలుస్తుండగా అటుగా దూసుకువచ్చిన జైలో కారు (నెం.ఎ.పి.09.సి.ఎ-0299) నిత్యను బలంగా ఢీకొట్టింది. పక్కనే నిలిపి ఉన్న మరో కారుకు, ఢీ కొట్టిన కారుకు మధ్య నిత్య ఇరుక్కుపోయింది. సంఘటనతో కారు నడిపిన వ్యక్తి రివర్స్ తీసుకుని ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని హుటాహుటిన బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును బాలుడు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.