Se*xual Assault: తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో ఓ భయానకర ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితమే జైలు నుండి విడుదలైన 23 ఏళ్ల వ్యక్తి ఓ 80 ఏళ్ల వృద్ధ మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం మహిళ వాకింగ్ చేస్తున్న సమయంలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం, నిందితుడు ఓ దొంగతనం కేసులో అరెస్ట్ కావడంతో జైల్లో ఉండగా శనివారం విడుదలయ్యాడు. ఇక అత్యాచారం జరిగిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని తెలిపారు.
ఇక ఘటన తర్వాత వృద్ధురాలిని ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఆమెకు వైద్య చికిత్సతో పాటు మానసిక కౌన్సెలింగ్ కూడా అందిస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆ వృద్ధురాలు అపాయం నుండి బయటపడింది. ఇక ఘటన జరిగిన నేపథ్యంలో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్ళినప్పుడు అతడు కత్తితో పోలీసులపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు కాగా.. నిందుతుడిపై కాల్పులు జరిపి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయమై సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. అతడి చేతిలో కత్తి ఉండడంతో హింసాత్మకంగా ప్రవర్తించాడు. ఆ దాడిలో మా ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మేము అతని కాళ్ల వద్ద కాల్చాల్సి వచ్చిందని తెలిపారు. అనంతరం గాయపడిన పోలీసులకు, నిందితుడికి వైద్య సేవలు అందించారు అధికారులు.
Read Also: AP Liquor Scam Case: హెడ్ కానిస్టేబుల్ లేఖపై స్పందించిన సిట్.. కీలక విషయాలు వెల్లడి..
మరోవైపు ఈ సంఘటనపై ప్రతిపక్ష AIADMK ముఖ్యంగా విపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి తమిళనాడు ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు ఎటు వెళ్తుందో.. ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి స్టాలిన్ పాలనపై ప్రజలకు నమ్మకం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ.. మహిళలపై నేరాలు పెరిగినట్టు ఏ ఆధారాలు లేవని, ఫిర్యాదుల సంఖ్య పెరగడం వల్లే ఇది అనిపిస్తోందని పేర్కొంది. DMK వర్గాలు ఇటీవల అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో నిందితుడికి ఐదు నెలల్లో జీవిత ఖైదు విధించడాన్ని న్యాయ వ్యవస్థ వేగంగా స్పందించిన ఉదాహరణగా చూపించాయి.