Hyderabad: సరదాగా ఆడుకుంటూ పిల్లలు తెచ్చిన పంచాయితీ... ఓ నిండు ప్రాణం బలితీసుకుంది. నా కొడుకునే మందలిస్తావా అంటూ.. ఓ తండ్రి చేసిన దాడిలో మరో పిల్లాడి తండ్రి బలయ్యాడు. పిల్లలకు సర్ధిచెప్పాల్సిన పెద్దలు.. రోడ్డెక్కి పిడిగుద్దులు గుద్దుకున్నారు. కాసేపటికే ఓ పిల్లాడి తండ్రి చాతినొప్పి అంటూ తల్లిడిస్తూ పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. ఘట్‌కేసర్ పరిధిలోని ఔషపూర్‌లో జరిగిన ఘటన విషాదం నింపుతోంది.
Crime News: మేడ్చల్ జిల్లా అంకుశాపూర్‌లో ఆస్తి గొడవలో బావ కుట్ర బయట పడింది. తన భార్య లావణ్య తమ్ముడు బోనాల ఈశ్వర్ కుటుంబాన్ని హత్య చేయించేందుకు సుఫారీ ఇచ్చినట్లు ఘట్‌కేసర్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బోనాల ఈశ్వర్ సోదరి లావణ్యకు 2009లో మేడ్చల్‌కు చెందిన శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. అప్పట్లో కట్నంగా ఒక ఎకరం భూమిని ఇచ్చారు. కానీ, 2020లో శ్రీనివాస్–లావణ్య దంపతులు మరింత ఆస్తి కావాలని వాదనలు పెట్టారు.…
హైడ్రా కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఘట్కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను కూల్చివేతకు హైడ్రా రెడీ అయ్యింది. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు అనేకమైన ఫిర్యాదులు అందాయి. సర్వే చేసి హైడ్రా.. అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి, కూల్చివేతలకు సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
Minister Komatireddy: ఘట్కేసర్లోని గట్టు మైసమ్మ దేవాలయాన్ని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారి జాతర దగ్గర మెట్లు, ఇతర మౌళిక వసతులు ఏర్పాటు చేస్తాం.. పేద ప్రజలకు అండగా ఉంటున్న ప్రజా ప్రభుత్వంపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను అని ఆయన తెలిపారు.
ఘట్కేసర్ పరిధి ఘాన్ పూర్ ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కారులో సజీవ దహనమయ్యారు. ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులను శ్రీరామ్, ఓ మైనర్ బాలికగా పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి కథనం వెలువడింది. "పొలంలో వరి నాట్లు వేస్తుండగా.. కారులో మంటలు అంటుకోవడం కనిపించింది. పైపు లైన్ లేకపోవడంతో.. బిందెలతో నీళ్ళు పోసి ఆర్పే ప్రయత్నం చేశాం.
ఘట్కేసర్ పరిధి ఘాన్ పూర్ ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులను శ్రీరామ్, ఓ మైనర్ బాలికగా పోలీసులు గుర్తించారు. మొదట తగలబడిన కార్‌ను చూసి ప్రమాదవశాత్తు మంటలు రావడంతో.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం అయ్యారు అని అనుకున్నారు.
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో సోమవారం కారు దగ్ధమై ఇద్దరు సజీవదహనం అయ్యారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Hyderabad Crime: మేడ్చల్ జిల్లా సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో MM రేక్ ప్యాసింజర్ ట్రైన్ కు గుర్తు తెలియని మృతదేహం వేలాడుతు ఘట్కేసర్ చేరుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Young woman attempted suicide in Ghatkesar: ప్రేమించిన వాడి మోసంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. వరంగల్ హైవేలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌పై నుండి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… Also Read: NKR21: ‘రాములమ్మ’ ఈజ్ బ్యాక్.. విజయశాంతి ఫస్ట్ లుక్, గ్లింప్స్…
మేడ్చల్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. భర్తను గొలుసులతో బంధించి భార్య చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పత్తి కృష్ణ (50), భారతి (45) అంబేద్కర్ నగర్ నివాసితులు. రెండు అపార్ట్మెంట్ల విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తింది. కృష్ణ తన భార్య నుండి ఏడాది క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భారతి భార్య మూడు రోజుల…