జూలై18న ఎన్డీయే కూటమి కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి పలు పార్టీలకు ఆహ్వానాలు పంపించేందుకు ఎన్డీఏ సిద్ధమయినట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఏ కూటమికి చెందని మరికొన్ని పార్టీలను ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు పార్టీలతో పొత్తుల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. కర్నాటకకు చెందిన జేడీఎస్, ఏపీకి చెందిన వైసీపీలతో పొత్తులుంటాయని రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతుంది.
Also Read: Krithi Shetty: కృతిశెట్టికి స్టార్ హీరో కొడుకు వేధింపులు.. అసలు నిజం చెప్పేసిందిగా!
అయితే, ఇటీవల అమిత్ షా నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జేపీ నడ్డాతో కూడా చర్చలు జరిపారు. ఈ లెక్కనా ఈ మీటింగ్ కు టీడీపీకి కూడా ఆహ్వానం వస్తుందనే టాక్ రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్డీయేలో చేరేది ఏ పార్టీ అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. 2018లో ఎన్డీయే నుంచి టీడీపీ పార్టీ వైదొలగింది. గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు వ్యవహరించారు. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో ఎన్డీయే సమావేశం జరుగుతుంది.
Also Read: JailerFirstSingle: జైలర్ ఫస్ట్ సింగిల్ అవుట్.. తమన్నా అందాలే హైలైట్
దీంతో ఎన్డీఏ సమావేశానికి టీడీపీ పార్టీకి ఆహ్వానం వస్తుందనే ఊహాగానాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. అయితే ఈ సమావేశం తర్వాత ఎన్డీఏలో చేరికపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా.. ఎన్డీఏ మీటింగ్ కి టీడీపీతో పాటు ఎల్జేపీ, అకాలీదళ్ తదితర పార్టీలు కూడా హాజరుకాబోతున్నాట్లు తెలుస్తుంది. మరోవైపు.. ఇప్పటికే ఎన్డీఏ ఉన్న భాగస్వామ్య పక్షాలతో పాటు కొత్తగా కూటమిలోకి తీసుకునే వారిని మీటింగ్ కు హాజరుకావాలని బీజేపీ నుంచి ఆహ్వానాలు పంపించనుంది. ఈ క్రమంలోనే టీడీపీ, శిరోమణి అకాళీదళ్, లోక్ జనశక్తి (పాశ్వాన్) సహా మరికొన్ని పార్టీలకు ఆహ్వానం అందినట్లు నేషనల్ మీడియాలో కథనాలు ప్రచారమవుతున్నాయి.
Also Read: Salaar : సలార్ సినిమా కోసం భారీగానే ఖర్చు చేసిన ప్రశాంత్ నీల్..?
ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్లో ఈ కీలక సమావేశం జరగబోతోంది. లోక్సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. అందుకే.. కేంద్ర, రాష్ర్టాల పార్టీలో మార్పులు, చేర్పులు చేశాక ఎన్డీఏ విస్తరణకు కసరత్తు పూర్తి చేసిన తర్వాతే ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు రాష్ర్టాల పార్టీల అధ్యక్షులను మార్చిన బీజేపీ పెద్దలు.. రెండు మూడ్రోజుల్లో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేయనుంది. ఈ కీలక సమావేశానికి ముందే మార్పులు, చేర్పులు జరగాలని.. వీలైతే కొత్తగా ఎన్డీఏలో చేరే ఒకట్రెండు పార్టీలకు కూడా కేంద్ర కేబినెట్లో చోటు కల్పించే ఛాన్స్ కనిపిస్తుంది.
Also Read: Kishan Reddy : కుటుంబ పాలన, అవినీతిపై మోడీ పోరాటం చేస్తున్నారు
బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసేందుకు విపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించిన వేళ ఎన్డీఏ ఇలా పార్టీలను ఆహ్వానించి మరీ మీటింగ్ పెట్టడం పెద్ద చర్చకే దారి తీసింది. అయితే ఈ మీటింగ్ కి ఎన్ని పార్టీలు హాజరువుతాయి..? ఇంకా ఎవరెవరితో బీజేపీ అగ్రనాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది..? ఏం జరుగుబోతుందనేది వేచి చూడాల్సిందే..