కోల్‌కతా విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కోల్‌కతా ఎయిర్ పోర్టులోని 3సీ డిపార్చర్ టెర్మినల్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో బయటకు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. అక్కడ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.
Also Read : Sri Sai Chalisa: శ్రీ సాయి చాలీసా వింటే సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది
దీంతో సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైరింజన్లు ఎయిర్ పోర్టులోని డిపార్చర్ టర్మినల్ కు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. 3సీ టెర్మినల్ భవనంలో సెక్యూరిటీ చెక్ ఏరియా సమీపంలో రాత్రి 9.20 గంటలకు మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read : Dattatreya Stotram: ఈ స్తోత్రాలు వింటే గ్రహదోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి
విషయం తెలుసుకున్న.. ఫైరింజన్ సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు 30 నిమిషాల పాటు శ్రమించి మంటల్ని ఆర్పివేసినట్లు అధకారులు పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉండే ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం కూడా మంటలర్పడంతో సహాయపడ్డాయి.
Also Read : Elephants: రోడ్డు ప్రమాదంలో మూడు ఏనుగులు మృతి
మరోవైపు ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా విచారం వ్యక్తం చేశారు. కోల్‌కతా విమానాశ్రయంలోని చెక్-ఇన్ కౌంటర్ దగ్గర దురదృష్టకరమని, అయితే స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. తాను ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌తో టచ్‌లో ఉన్నానని తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది అంతా ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేశారు.. అందరూ క్షేమంగా ఉన్నారు.. రాత్రి 10:25 గంటలకు చెక్-ఇన్ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. అగ్నిప్రమాదానికి గల కారణాలను వీలైనంత త్వరగా తెలుసుకుంటామన్నారు. ఈ ఘటన తర్వాత విమానాశ్రయం నుంచి వెళ్లే విమానాల కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా.. చెక్ ఇన్ ప్రాసెస్ కార్యకలాపాలు రాత్రి 10.25 నిమిషాలకు పున: ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు.