Triangle Love : వారిద్దరు ప్రాణ స్నేహితులు. వీరు ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిపై మోజు పెంచుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఒకడు ఎలాగైనా ఇంకొకడిని మట్టుబెట్టాలని పన్నాగం పన్నాడు. అనుకున్నట్లే ఇంకొకరిని పార్టీ పేరుతో పిలిచి కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని కటకటాల్లోకి నెట్టారు. పూర్నియాలో చర్చనీయాంశమైన మోహిత్ రంజన్ హత్య కేసును ఛేదించడంలో పోలీసులు విజయం సాధించారు. మోహిత్ రంజన్‌ను అతని ఇతర సహచరుల సహాయంతో అతని ప్రాణ స్నేహితుడే చంపాడు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కర్రలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రయాంగిల్ లవ్ కారణంగానే మోహిత్ హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. మోహిత్ స్నేహితుడు పీయూష్ అతని సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Sri Datta Stotram: మనోభీష్టాలు నెరవేరాలంటే శ్రీ దత్తాత్రేయ స్తోత్రం వినండి
మోహిత్ మెడికల్ స్టోర్స్ నడుపుతున్నాడు. మోహిత్, పీయూష్ ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. దీంతో మోహిత్ పై పీయూష్ కోపం పెంచుకుంటాడు. దీని కారణంగా పియూష్ మోహిత్‌ను ఎలాగైన తన ప్రేమను అడ్డుతొలగించుకోవాలని భావిస్తాడు. ఈ క్రమంలోనే మోహిత్ ను చంపడానికి కుట్ర పన్నాడు. పథకం ప్రకారం ఏప్రిల్ 14వ తేదీ రాత్రి పార్టీ సాకుతో మోహిత్‌కు పియూష్ ఫోన్ చేశాడు. మోహిత్, పీయూష్ మధ్య వాగ్వాదం జరిగింది. దీని తర్వాత, పీయూష్ అతని సహచరులు మోహిత్‌ను కొట్టి చంపారు.
Read Also: Stampede in Yemen: ఘోర విషాదం.. ఆర్థిక సహాయ పంపిణీలో తొక్కిసలాట, 85 మంది మృతి
మోహిత్ ను హత్య చేసిన తర్వాత దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మోహిత్ మృతదేహాన్ని పీయూష్ సౌరా నదిలో విసిరాడు. అలాగే మోహిత్ బైక్‌ను, బ్యాగును కూడా నది ఒడ్డున వదిలేశాడు. పోలీసుల గాలింపులో ఏప్రిల్ 16 న మోహిత్ మృతదేహం బెలోరి సమీపంలోని సౌరా నదిలో కనుగొన్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. అదే రోజు పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పీయూష్, అలోక్, కౌశల్, అమర్ కుమార్ సింగ్‌లను అరెస్ట్ చేశారు.