ఒకటి కాదు రెండు కాదు……ఏకంగా తొమ్మిది పెళ్ళిళ్ళు చేసుకొని….తొమ్మిదో భర్తకు దొరికింది పెళ్ళిళ్ళ ఖిలాడీ. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ పెళ్ళి సంభందాలకు సంబంధించిన మ్యాట్రిమోనీ సైట్లో ఆంధ్రా అబ్బాయికి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా పెళ్లికి దారి తీసింది. ఆ అమ్మాయి తన పెళ్లి సంబంధం కుదర్చుకునేందుకు తమ ఇంటిల్లిపాదిని వెంటబెట్టుకుని ఆంధ్రాలోని అబ్బాయి ఇంటికి వెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు. 2018లో పెళ్ళి చేసుకున్న ఈ నవ దంపతులు రెండు నెలలు మాత్రమే కాపురం చేశారు. ఈ రెండు నెలల కాలంలో ఆ అమ్మాయి తరుచూ ఫోన్లో మాట్లాడుతూ కోర్టు విషయాలలో తలమునకలై ఉండేదని. ఏంటని భర్త ప్రశ్నిస్తే తనతో గొడవలకు దిగేదని భర్త వాపోయాడు. ఇలా నడుస్తున్న క్రమంలో ఓ రోజు బెంగుళూరు నుంచి ఆకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్ళాలని పట్టుబడిందని… వెళ్ళి వచ్చాకా మళ్లీ వెళ్లాలని అనడంతో అనుమానం వచ్చి ఫాలో చేసి ఆరా తీయగా…..ఆమె చేసిన తతంగం అంతా బయటపడింది.
అక్కడే ఆమెకు సంబంధించిన వివరాలు లాగగా షాక్ కు గురయ్యానని…..ఆమె చేసుకున్న పెళ్ళి తతంగాలు అంతాఇంతా కాదని ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకుని తొమ్మిదో పెళ్లికి నేను బుక్కాయ్యానని తెలుసుకున్న భర్త తన నుంచి విడాకులు కావాలని కోరాడు. దీంతో ఆ ఖిలాడీ భర్త నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించింది. దీంతో నివ్వెర పోయిన భర్త ఆమె చేసుకున్న వివాహాల గురించి చిట్టా విప్పాడు. ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎవరిని పెళ్ళి చేసుకుంది….ఎంత లాగింది అని.. కొందరైతే మరణించిన సందర్భాలున్నాయి. ఇలా వలుపు పరిచి దొరికినంత దొచుకోవడంలో ఆ ఖిలాడీ లేడీ స్టైలే వేరు. చివరకు మహబూబూబాద్ పోలీసు స్టేషన్ గడపలో ఆ భర్తకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి మరి. ఈ విషయం కాస్తా జిల్లా బాస్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళిగా టౌన్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు.