Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి భరత్ కీలక వ్యాఖ్యలు.. హైకోర్టు బెంచ్ కోసం కర్నూలులో 25 నుండి 30 ఎకరాల స్థలం సేకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు.. ఇక, ఏపీలో త్వరలో 14 వేల కోట్లతో సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు రానున్నాయన్నారు మంత్రి టీజీ భరత్. భారత్ లో మొదటిసారి సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చామన్నారాయన. ఈ పెట్టుబడులు యూపీకి వెళ్లకుండా ఏపీకి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కృషి చేశామన్నారు టీజీ భరత్. రూ.14 వేల కోట్ల ప్రాజెక్టు కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారాయన. ఈ ప్రాజెక్టు రెండున్నరేళ్లలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.. కర్నూలు జిల్లా ప్రజలకు ఇదొక పెద్ద క్రిస్మస్ కానుక అన్నారు మంత్రి భరత్.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
కాగా, కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇప్పటికే తీర్మానం చేసిన విషయం విదితమే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవంబర్ 21వ తేదీన ఈ తీర్మానాన్ని న్యాయ, న్యాయశాఖ మంత్రి ఎన్. ఎండి. ఫరూక్ ప్రవేశపెట్టగా.. ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇక, రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తూ, కర్నూలులో ఉన్న లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మరియు కొన్ని ట్రిబ్యునళ్లను ప్రభుత్వం మార్చదని పేర్కొన్న విషయం విదితమే..