Kethireddy Pedda Reddy: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు నగరానికి చేరుకున్నారు. తన ఇంటి వద్ద మునిపల్ అధికారులు చేపట్టిన సర్వేను ఆయన పరిశీలించారు. తన ఇళ్లు, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లబు ఆయన అధికారులకు అందచేశారు. తన ఇంటి స్థలంలో మునిసిపల్ స్థలం ఆక్రమించలేదని ఆయన అధికారులకు తెలిపారు. నా ఇంటికి ప్లానింగ్ ఉందో లేదో అధికారులే తెలియజేయాలని ఆయన అన్నారు. సర్వేలో 1వ ఫ్లాట్ నుంచి 16 ఫ్లాట్ వరకు సర్వే చేయాలని..…
గుంటూరు జిల్లా తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి మేరీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు కాలనీలో ప్రభుత్వ స్థలం శుభ్రం చేసి పార్కును ఏర్పాటు చెయ్యాలని ఆలోచనలో మున్సిపల్ అధికారులు ఉన్నారు.
హైదరాబాద్ నగరంలో.. పెంపుడు కుక్క రోడ్డుపై మలవిసర్జన చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. మిగతా మున్సిపల్ ప్రాంతాల్లోనూ ఈ జరిమానా అమలు చేయాలని మున్సిపల్ శాఖ కమిషనర్ & డైరెక్టర్ శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్ వీడియో గేమ్‌జోన్‌లో అగ్ని ప్రమాదం సంభవించి 28 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో చిన్నారులు ఉండటం, వారంతా తీవ్రంగా కాలిపోవడం అందరినీ కలచివేసింది. ఈ కేసు గుజరాత్ హై కోర్టులో విచారణకు వచ్చింది.