Rahul Gandhi: రాహుల్ గాంధీ సహా 7 మంది ప్రతిపక్ష ఎంపీలకు పాకిస్థాన్ నుంచి మామిడి పండ్లు?..బీజేపీ ఫైర్
- కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పాకిస్థాన్ నుంచి మామిడి పండ్లు
- రాహుల్ గాంధీ సహా 7 మంది ప్రతిపక్ష ఎంపీలకు పళ్ల పంపిణీ
- భారతీయ జనతా పార్టీ నేతలు ఫైర్
- ఈ అంశంపై ఇంకా స్పందించని కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పాకిస్థాన్ నుంచి మామిడి పండ్లను పంపిందన్న వార్తలపై భారతీయ జనతా పార్టీ మండిపడుతోంది. ఇది పాకిస్థాన్‌తో ‘నీచమైన’ సంబంధమని బీజేపీ అభివర్ణించింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ నుంచి రాహుల్ సహా 7 మంది ఎంపీలకు మామిడి పళ్ల డబ్బాలు పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి వ్యాఖ్య లేదు. మీడియా కథనాల ప్రకారం.. రాహుల్‌తో పాటు, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్, కేరళలోని తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు ఎం నద్వీ, జియావుర్ రెహ్మాన్ బెర్గ్, ఇక్రా హసన్, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీలకు మామిడి పండ్లను పంపారు. భారత్-పాక్ రెండూ శత్రు దేశాలన్న విషయం తెలిసిందే. పుల్వామా దాడి తర్వాత సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
READ MORE: CM Revanth Reddy: డల్లాస్ లో సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ లో ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీపై చర్చ..
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. యూపీ మామిడిపండ్లు అంటే ఇష్టం లేదని రాహుల్ గాంధీ కొంతకాలం క్రితం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. “పాకిస్థాన్ వారికి మామిడి పండ్లను పంపింది. యూపీ కంటే పాకిస్థాన్ నుంచి వచ్చిన మామిడిపండు ఇష్టమా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. మోడీని తొలగించడాని యత్నిస్తున్నారా? దానిలో భాగంగా కొత్తగా పాక్ తో చర్చలు జరపడానికి అక్కడికి వెళ్లారా?” అని ప్రశ్నించారు.
READ MORE:Vijay-TVK Party: తిరుచ్చిలో భారీ బహిరంగ సభ.. పార్టీ అజెండాను ప్రకటించనున్న విజయ్!
దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా స్పందించారు. “ఏ ప్రదేశాన్ని ప్రేమిస్తున్నారో అక్కడ నుంచి మామిడిపళ్లు వస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని మామిడిపండ్లలో కొందరు తప్పులు కనుగొన్నారు. అవి రుచిగా లేవు. ఉత్తరప్రదేశ్‌లోని మామిడిపండ్లలోని తీపిని ఇష్టపడని రాహుల్ గాంధీ పాకిస్థాన్‌లోని మామిడిపండ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.” అని వ్యాఖ్యానించారు. మామిడి పండ్లను పంపడంపై బీజేపీ నేత అమిత్ మాల్వియా కూడా ప్రశ్నలు సంధించారు.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!