TVK Public Meeting in Tiruchi: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 2న టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయమని, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని చెప్పారు. ముందే చెప్పినట్లు 2026 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ వేగంగా అడుగులు వేస్తున్నారు.
సెప్టెంబర్ 25 తేదిన తిరుచ్చిలో తొలి భారీ బహిరంగ సభ ఎర్పాటు చేయాలని తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ బహిరంగ సభలో పార్టీ విధివిధానాలు, జెండా, అజెండాలను విజయ్ ప్రకటించనున్నారట. త్వరలోనే ఈ బహిరంగ సభపై టీవీకే నుంచి అధికార ప్రకటన రానుందట. ఇప్పటికే పెద్ద ఎత్తున తమిళనాడు యువతకు దగ్గరయ్యేలా పలు కార్యక్రమాలను దళపతి చేపట్టారు. అయితే విజయ్ సొంతంగా పోటీ చేస్తారా? లేదా ఏఐఏడీఎంకేతో కలుస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: Naga Chaitanya Engagement: సమంత లవ్ ప్రపోజల్.. శోభితతో ఎంగేజ్‌మెంట్ ఒక్కటే రోజు?
‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)లో విజయ్ నటించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. విజయ్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రాబోతుంది.