పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ పర్యటన గురించి ఆయన ప్రస్తావించారు. ఈ పర్యటన భారత్-పాక్ మధ్య ఒక ఆరంభం అన్నారు.
ఇస్లామాబాద్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. కానీ, పాకిస్థాన్ ఆయన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. జైశంకర్ సూటిపోటి మాటలకు భయపడి పాక్ ఈ చాకచక్య చర్య తీసుకుందని చెబుతున్నారు.
సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్ ప్రభుత్వానికి గట్టిగా నోటీసు పంపింది. ఈ ఒప్పందం చాలా పాతదని, మార్పులు కోరుకుంటున్నామని పాకిస్థాన్‌కు పంపిన నోటీసులో భారత్ పేర్కొంది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పాకిస్థాన్ నుంచి మామిడి పండ్లను పంపిందన్న వార్తలపై భారతీయ జనతా పార్టీ మండిపడుతోంది. ఇది పాకిస్థాన్‌తో 'నీచమైన' సంబంధమని బీజేపీ అభివర్ణించింది.