Delhi Chalo: తమ డిమాండ్ల సాధన కోసం రేపు( మంగళవారం) ‘ఢిల్లీ చలో’ పేరుతో ఆందోళన చేపట్టాలని రైతన్నలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హరియాణా, ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తూ.. భారీ బలగాలను మోహరించారు. పంజాబ్‌తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు దగ్గర హరియాణా పోలీసులు మూసివేశారు. అత్యవసరమైతే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని ప్రజలకు పోలీసులు సూచించారు. అంబాలా, ఖైథల్, సోనీపత్, పంచకుల్‌లో 144 సెక్షన్ విధించారు.
Read Also: Medaram Traffic: మేడారంలో ట్రాఫిక్ కష్టాలు.. జాతర స్టార్ట్ అయితే పరిస్థితేంటి..?
ఇక, రైతులు ఢిల్లీ చలోలో పాల్గొనకుండా నిలిపివేసేందుకు పలు గ్రామాల సర్పంచులతో పోలీసులు సమావేశాలు జరుపుతున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా నివారించేందుకు హరియాణా ప్రభుత్వం ఇప్పటికే మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. మరోవైపు- ఈశాన్య ఢిల్లీలో పోలీసులు సెక్షన్-144 విధించారు. ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌ల నుంచి భారీగా రైతులు ఆందోళనకు తరలివచ్చే అవకాశాలు ఉండటంతో తమ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో 5 వేల మంది పోలీసు సిబ్బందిని ప్రభుత్వం మోహరించింది.
Read Also: Rozgar Mela: నేడు లక్ష మందికి ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ లెటర్ల పంపిణీ
అయితే, ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేల మంది రైతులు ఢిల్లీకి వచ్చే ఛాన్స్ ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆందోళనను ఎలా చేపట్టాలన్న దానిపై రైతు సంఘాలు 40 సార్లు రిహార్సల్ నిర్వహించాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. 2,000-2,500 ట్రాక్టర్లను రేపు (మంగళవారం) దేశ రాజధానికి తీసుకొచ్చేందుకు అన్నదాతలు రెడీ అవుతున్నారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, కర్ణాటకల నుంచి కర్షకులు కార్లు, ద్విచక్రవాహనాలు, మెట్రో, రైళ్లు, బస్సుల ద్వారా కూడా ఢిల్లీకి చేరుకుంటారని నిఘా వర్గాలు వెల్లడించాయి.
Read Also: Qatar-India: గూఢచర్యం ఆరోపణలు.. 8 మంది భారతీయులను విడుదల చేసిన ఖతార్ ప్రభుత్వం!
‘ఢిల్లీ చలో’కు రైతులు సిద్ధమవుతున్న వేళ.. వారిని కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరో దఫా చర్చలు జరిపేందుకు పిలిచింది. అన్నదాతల డిమాండ్ల పరిష్కారం దిశగా ఈ సమావేశంలో సమాలోచనలు జరిగే ఛాన్స్ ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో దాదాపు 200 రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ను తలపెట్టాయి.