Delhi Chalo: పంజాబ్ రాష్ట్రంలోని శంభు సరిహద్దు నిరసన ప్రదేశం నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం ఈ రోజు (డిసెబర్ 6) దేశ రాజధాని ఢిల్లీకి మార్చ్‌గా బయలు దేరుతుందని రైతు నాయకుడు స్వరణ్ సింగ్ పంధేర్ పేర్కొన్నారు.
రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ఛాన్స్ లేకుండా రోడ్లపై భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడుస్తుంది.. వారు ఢిల్లీకి వెళ్లకపోతే, లాహోర్‌కు పంపించాలా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నేతృత్వంలోని పంజాబ్ రైతులు ‘ఢిల్లీ చలో’ కవాతున�
ఢిల్లీలో రైతుల ఆందోళన మళ్ళీ ప్రారంభం కావడంతో శంభు సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. సరిహద్దుల దగ్గర మోహరించిన వేలాది మంది రైతులు ఇవాళ ఉదయం ఒక్కసారిగా ముందుకు కదలడంతో వారిని ఆపేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
Farmers Protest: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ని డిమాండ్ చేస్తూ రైతులు ‘ఢిల్లీ ఛలో’ మార్చ్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతులు దేశ రాజధానిని ముట్టడించాలని యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని హర్యానా-ఢిల్లీ బార్డర్‌లో అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య
రైతులు చేస్తున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు దేశ రాజధాని పోలీసులు భారీ ప్లాన్ కు సిద్ధం అయ్యారు. పంజాబీ రైతుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సుమారు 30 వేల టియర్ గ్యాస్ షెల్స్‌ను ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తుంది.
దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధర(MSP)కి చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
తమ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వరుసగా మూడో రోజు కూడా ఆందోళనలకు దిగుతామని రైతులు హెచ్చరించారు.
Another Tear Gas Attack on Farmers: ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిరసన కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఉన్న రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం జరిగింది. మంగళవారం ఉదయం పంజాబ్-హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘటనలో 60 మంది రైతులు గాయపడ్డారని తెలుస్తోంది. పంజాబ్, హర్యా
రైతుల నిరసనలు ఒక్క ఢిల్లీలోనే కాదు. ఫ్రాన్స్‌లో విదేశీ పోటీ నుంచి మెరుగైన వేతనం, రక్షణ కోసం డిమాండ్లు, జర్మనీలో వ్యవసాయ డీజిల్‌పై పన్ను మినహాయింపును దశలవారీగా తొలగించడం, ఇతర దేశాలలో ఈయూ పర్యావరణ నిబంధనలకు సవాళ్లు వంటి వివిధ కారణాల వల్ల యూరోపియన్ దేశాలు ఇటీవలి కాలంలో రైతుల నిరసనను చవిచూశాయి.