అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం అని డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాము. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read : Akhanda 2: బాలయ్య సినిమాకి 80 కోట్ల ఓటీటీ డీల్!
మరోపక్క అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. బాధిత వారందరికీ ప్రార్థనలు, బలాన్ని చేకూర్చండి. నా ఆలోచనలు ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబాలతో ఉన్నాయి అని ఆయన అన్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పై అల్లు అర్జున్ స్పందిస్తూ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. నిజంగా ఈ దుర్ఘటన హృదయ విదారకం అన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం పై స్పందించిన రామ్ చరణ్, అహ్మదాబాద్‌లో జరిగిన దురదృష్టకర విమాన ప్రమాదం గురించి తెలిసి చాలా బాధపడ్డానన్నారు. అందరు ప్రయాణీకులు, సిబ్బంది, బాధిత వ్యక్తులు మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.
అహ్మదాబాద్ విమాన దుర్ఘటన పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం లో జరిగిన భయంకరమైన విషాదం గురించి విని చాలా బాధపడ్డాను. ఇది ఎంత హృదయ విదారకమో చెప్పడానికి మాటలు సరిపోవు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి మరియు ప్రార్థనలు, వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని అన్నారు.