ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో (Uttar Pradesh Kanpur) ఇద్దరు బాలికల మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
కాన్పూర్ జిల్లా (Kanpur) కొత్వాలి గ్రామానికి చెందిన 16, 14 ఏళ్లు కలిగిన ఇద్దరు బాలికలు (2 Girls Bodies) బుధవారం సాయంత్రం పొలాల్లోకి వెళ్లారు. కానీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వెతుకుకుంటూ సమీప ప్రాంతాలను గాలించారు. ఓ చెట్టుకు ఇద్దరు మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.
ఇదిలా ఉంటే తమ బిడ్డలకు బలవంతంగా మద్యం తాగించి, అత్యాచారం చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం చెట్టుకు వేలాడదీశారని ఆరోపించారు.
స్థానిక కాంట్రాక్టర్ రామ్‌రూప్ నిషాద్ కుమారుడు రాజు (18), మేనల్లుడు సంజయ్ (19)లే బాలికలకు మద్యం తాగించి అత్యాచారం చేశారని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలు తీసి బెదిరించారని ఆరోపించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ఫోన్‌లో ఉన్న వీడియోలను పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇద్దరు బాలికలు, వారి కుటుంబ సభ్యులు రామ్‌రూప్ నిషాద్ నడుపుతున్న ఇటుకల బట్టీలో పనిచేశారు. ఆ బట్టీకి 400 మీటర్ల దూరంలోనే ఇద్దరి బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయని అదనపు పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) హరీష్ చందర్ తెలిపారు. సామూహిక అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాలు లభ్యమైన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు.