Vaibhav Suryavanshi: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అనేలా ఐపీఎల్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే దేశం తరపున చరిత్ర సృష్టిస్తున్న వైభవ్ ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డపై యూత్ క్రికెట్‌లో తన ముద్ర వేస్తున్నాడు. కేవలం బ్యాటింగ్ లో మాత్రమే కాదు.. బౌలింగ్ లోనూ ఆకట్టుకుంటూ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి యూత్ టెస్టులో వైభవ్ సూర్యవంశీ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కనపరిచాడు.
Read Also:Movie Ticket Prices: ఏ సినిమా థియేటర్స్ అయినా టికెట్ రూ.200 దాటకూడదు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
మొదటి ఇన్నింగ్స్‌లో వైభవ్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసినా, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 56 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇది ఇలా ఉండగా ఈ సరి బ్యాటింగ్ తో మాత్రమే కాకుండా బౌలింగ్ లోను తన ప్రతిభను కనపరిచాడు. నిజానికి వైభవ్ సూర్యవంశీ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఈ మ్యాచ్‌లో అతడు రెండు కీలక వికెట్లు తీసాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ హంజా షేక్ (84), థామస్ రెవ్ (34) ల రెండు వికెట్లతో అతడు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత అండర్-19 టెస్టు క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్సులో (14 సంవత్సరాలు 107 రోజులు) వికెట్ తీసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
Read Also:Mamata Banerjee: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వారిపై వేధింపులు.. మమతా బెనర్జీ ఆగ్రహం!
ఇకపోతే, భారత అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రే (102) శతకంతో మంచి ఇన్నింగ్స్ ఆడగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక దీనికి సమాధానంగా ఇంగ్లాండ్ 439 పరుగులు చేసింది. ఫలితంగా భారత్‌కు 101 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత తర్వాత భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 350 పరుగుల లక్ష్యం నిలిచింది. ఇక చివరి రోజు ఐదో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసి గట్టిగా పోరాడింది. దీనితో చివరకు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
At 14 years and 107 days, Vaibhav Suryavanshi becomes the youngest Indian to take a wicket in a Youth Test match. 🧒🔥 pic.twitter.com/JjyLzDvt57
— Sports Culture (@SportsCulture24) July 15, 2025