Vaibhav Suryavanshi: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అనేలా ఐపీఎల్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే దేశం తరపున చరిత్ర సృష్టిస్తున్న వైభవ్ ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డపై యూత్ క్రికెట్‌లో తన ముద్ర వేస్తున్నాడు. కేవలం బ్యాటింగ్ లో మాత్రమే కాదు.. బౌలింగ్ లోనూ ఆకట్టుకుంటూ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి యూత్ టెస్టులో వైభవ్…