Assam : బాలిక పై అత్యాచారం చేశాడు.. చంపి సెప్టిక్ ట్యాంక్ లో పడేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam : దేశంలో రోజు రోజుకూ మహిళలు చిన్నారులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా… పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా దారుణాలు తగ్గడం లేదు. కామాంధుల చేతిలో మహిళలు, ముక్కుపచ్చలారని చిన్నారులు బలైపోతున్నారు. తాజాగా మరో అమానుష ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ పన్నెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. కోరిక తీర్చుకున్నాక బాలికను అతి కిరాతకంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అస్సాం రాష్ట్రంలోని తిన్‌సుకియా జిల్లా మార్గరీటా ప్రాంతంలో అనన్ భార్యతో కలిసి నివసిస్తున్నాడు.
Read Also: Sharad Pawar: ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్ కొనసాగాలి.. రాజీనామా తిరస్కరణ
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
అదే ప్రాంతానికి చెందిన 12ఏళ్ల బాలిక తరచూ వీరి ఇంటివైపు వస్తుండేది. ఆ క్రమంలోనే అతడికి బాలికపై కన్ను పడింది. ఎలాగయినా ఆ చిన్నారి పై అత్యాచారం చేయాలని సమయం కోసం ఎదురు చూశాడు. మంగళవారం అతడికి బాలిక ఒంటరిగా కనిపించడంతో దారుణానికి ఒడిగట్టాడు. బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లిన అనన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వికృతచేష్టలతో బాలిక భయపడిపోయింది. బాలిక ఏడవడం చూసి విషయం బయటపెడుతుందోనని అతడు మరో దారుణమైన ఆలోచన చేశాడు. బాలికను చంపి ఆ మృతదేహాన్ని ఇంటి సెప్టిక్ ట్యాంక్ లో పడేశాడు. అనంతరం అక్కడనుంచి పరారయ్యాడు.
Read Also:YSR Kalyanamastu: వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల
ఇలోగా తమ కూతురు కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. అనన్ ఇంటి సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహం లభించింది. అప్పటికే అనన్ పరారీలో వుండటంతో అతడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. బాధిత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ లో నిందితుడు అనన్ పట్టుబడ్డాడు. అయితే స్వరాష్ట్రానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుల నుండి అనన్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అనన్ ను వెంబడించిన పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడిని పోలీసులు స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అయితే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్యచేసిన నిందితున్ని ఎన్కౌంటర్ చేయాలన్న స్థానికులు డిమాండ్ చేయడంవల్లే పోలీసులు కాల్పులు జరిపి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?