Pakistan: పాకిస్తాన్ తగలబడిపోతోంది. ఇస్లామిక అతివాద సంస్థ ‘‘తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP)’’ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో తీవ్ర హింస చోటు చేసుకుంది. పోలీసులు, ప్రదర్శనకారులకు మధ్య తీవ్ర యుద్ధం నెలకొంది.
Assam : దేశంలో రోజు రోజుకూ మహిళలు చిన్నారులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా... పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా దారుణాలు తగ్గడం లేదు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళన చేసేందుకు ఆర్మీ అభ్యర్థులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గురువారం రాత్రే యువకులు హైదరాబాద్‌కు తరలివచ్చారని.. జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకున్నట్లు తెలుసుకుని అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు తొలుత శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బయట ఓ బస్సు అద్దాలను ఆందోళనకారులు పగులగొట్టారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళనకారులు…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఆర్పీఎఫ్ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలయ్యాయి. మృతుడు వరంగల్‌కు చెందిన దామోదర్‌గా పోలీసులు గుర్తించారు. దామోదర్ మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ 8 మందికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ ఘటనతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు సికింద్రాబాద్ పరిధిలో 71 రైళ్లను రైల్వేశాఖ…
ఛత్తీస్‌గడ్‌లో మరోసారి పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. దంతెవాడ జిల్లా గోండెరాస్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మహిళా మావోయిస్టులు హిద్మే కొహ్రమె, పొజ్జె లుగా పోలీసులు గుర్తించారు. అయితే హిద్మే తలపై రూ.5లక్షలు, పొజ్జె తలపై రూ.లక్ష రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏజేన్సీలో అనుమానం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.…