Zomato: ఇటీవల కాలంలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫారంల వినియోగం చాలా పెరిగింది. ముఖ్యం మెట్రో సిటీలతో పాటు మమూలు పట్టణాల్లో కూడా వీటికి డిమాండ్ ఏర్పడింది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వీరి సేవల్లో తప్పులు జరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ జోధ్‌పూర్ నగరంలో ఓ వినియోగదారుడికి జొమాటో వెజ్ స్థానంలో నాన్-వెజ్ ఫుడ్‌ని డెలివరీ చేసింది.
Read Also: Manipur Violence: మైయిటీ విద్యార్థుల హత్యలో కీలక సూత్రధారిని అరెస్ట్ చేసిన సీబీఐ..
ఈ వివాదంలో జిల్లా వినియోగదారుల ఫోరం జొమాటోతో పాటు రెస్టారెంట్ భాగస్వామి మెక్‌డొనాల్డ్స్‌కి కలిపి రూ. 1 లక్ష జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు జొమాటో సిద్ధమైంది. డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ ఫోరమ్ (II) జోధ్‌పూర్, వినియోగదారుల రక్షణ చట్టం-2019ని ఉల్లంఘించినందుకు జొమాటో మరియు రెస్టారెంట్ భాగస్వామి అయిన మెక్‌డొనాల్డ్స్‌పై రూ. 1 లక్ష జరిమానా విధించింది. మానిటరీ పెనాల్టీ, లిటిగేషన్ ఖర్చును రూ.5000 భరించాలని తీర్పు చెప్పింది.
అయితే ఈ కేసులో జొమాటో ఆర్డర్‌కి వ్యతిరేకంగా అప్పీల్ చేసే ప్రక్రియలో ఉంది. కస్టమర్‌కి ఆర్డర్ అందించే సేవల్ని మాత్రమే జొమాటో చేస్తోంది, ఆర్డర్ తప్పుగా రావడం, నాణ్యత లేకపోవడం వంటివి రెస్టారెంట్ బాధ్యతే అని స్పష్టం చేసింది.