అమ్మాయిలను వెంటపడి వేధించడం.. అల్లరి చేయడం.. ప్రేమ పేరుతో అఘాయిత్యాలకు పాల్పడడం తరుచుగా కనిపిస్తుంది. ఈ వేధింపులు తట్టుకోలేక చదువులు మానేసేవారు కొందరైతే.. పోలీసులకు ఫిర్యాదు చేసేవారు మరికొందరు ఉంటారు.. ఎదిరిస్తే ఏమవుతుందో అనే భయంతో మౌనంగా భరించే వారు ఇంకొందరు ఉంటారు. కానీ ఓ విద్యార్థిని అలా ఊఱుకోలేదు.. తన వెంటబడి వేధించిన వాడిని నలుగురిలో చెప్పుతో కొట్టి పోలీసులకు అప్పగించింది.
Read Also : Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం చేసి పల్లకిలో ఊరేగింపు..
దీనికి సంబంధించిని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి కాలేజీకి యువతి ఓ వ్యక్తి వెంబడించి, వేధించాడం స్టార్ట్ చేశాడు. దీంతో ఆ సదరు యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు.
వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు ఆ యువకుడిని పట్టుకున్నారు. ఆ తరువాత యువతి ఆ వ్యక్తి ముఖంపై బహిరంగంగానే చెప్పుతో కొట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటుచేసుకుంది.
Read Also : Bellamkonda Suresh: బెల్లంకొండ సురేష్ కారులో చోరీ.. కారు అద్దాలు పగలగొట్టి..
అయితే ప్రస్తుతం.. ఈ వీడియోలో అమ్మాయి అతని తలపై, ముఖంపై తన కాలి చెప్పులతో కొడుతుండడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తనను విడిచిపెట్టమని ఆ వ్యక్తి స్థానికులను అభ్యర్థిస్తుండడం వీడియోలో కనిపిస్తుంది. అమ్మాయి కొడుతుంటే సదరు వ్యక్తి ఏమీ చేయకుండా.. దెబ్బలు తిన్నాడు. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్తున్న బాలికను ఆ వ్యక్తి వెంబడించి వేధించాడని స్థానికులు తెలిపారు. చితక బాదిన తరువాత అతడిని పోలీసులకు అప్పగించారు.