Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- వెస్టిండీస్‌పై రెండో టెస్టులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం.
- రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసిన పాకిస్థాన్.
- WTC 2025-27 పాయింట్ల పట్టికలో 9వ స్థానం నుంచి 8వ స్థానానికి చేరిన పాక్....
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak vs WI: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27లో పాకిస్థాన్ జట్టు కీలక విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్‌ను 8 వికెట్ల తేడాతో గెలిచింది పాకిస్థాన్. దీనితో పాక్ WTC పాయింట్ల పట్టికలో ఒక స్థానం మెరుగుపర్చుకుంది. తొలి టెస్టులో ఓటమి పాలైన తర్వాత పట్టికలో చివరి స్థానానికి చేరుకున్న పాకిస్థాన్, ఈ విజయంతో తిరిగి 8వ స్థానానికి చేరుకుంది.
రెండో టెస్టు విజయంతో పాకిస్థాన్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేయడంతో.. దీంతో ఆ జట్టు పాయింట్ల శాతం (PCT) 22.22కి చేరుకుంది. తొలి టెస్టు తర్వాత కేవలం ఒకే విజయంతో పట్టికలో అట్టడుగున ఉన్న పాకిస్థాన్‌కు ఈ విజయం కాస్త ఊరటనిచ్చింది.
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో 8 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, ఒకే ఓటమితో ఆ జట్టు 87.50 PCT ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 75.00 PCTతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ 72.22 PCTతో మూడో స్థానంలో ఉన్నాయి. ఆపై బంగ్లాదేశ్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రాతో 58.33 PCT సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఇక శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ ఇప్పటివరకు తొమ్మిది టెస్టుల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములు, ఒక డ్రాతో 48.15 PCTతో భారత జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా శ్రీలంక (41.67 PCT), ఇంగ్లండ్ (24.36 PCT) వరుసగా ఆరో, ఏడో స్థానాల్లో ఉన్నాయి.

ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ అద్భుత విజయం సాదిందించింది. ఈ విజయంతో విదేశీ గడ్డపై వరుసగా 8 టెస్టుల్లో ఎదురైన ఓటముల పరంపరకు స్వస్తి పలికింది. అంతేకాకుండా వెస్టిండీస్‌పై 2000 సంవత్సరం తర్వాత ఒక్క టెస్ట్ సిరీస్ కూడా కోల్పోని రికార్డును కొనసాగించింది.
ఈ మ్యాచ్ లో 77 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన అబ్దుల్లా షఫీక్ అజేయంగా 24 పరుగులు చేయగా, కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి సిరీస్ ఆడుతున్న బాబర్ అజామ్ కూడా 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్‌ను ముగించే క్రమంలో బాబర్, వెస్టిండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు. దీనితో సిరీస్ 1-1తో సమం అయ్యింది.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!