UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- ఉత్తరప్రదేశ్‌లో అరుదైన ఘటన
- ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త
- స్థానికంగా చర్చనీయాంశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు పిల్లల తల్లైన భార్యకు ఆమె ప్రియుడితో భర్తే స్వయంగా పెళ్లి జరిపించాడు. కుటుంబంలో రోజూ జరుగుతున్న గొడవలకు ముగింపు పలకాలని భావించిన భర్త.. భార్య కోరుకున్న వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో జరిగింది.
దేబ్రీ గ్రామానికి చెందిన బుద్ధిరామ్ నిషాద్ (45), ఫూల్మతి (37) భార్యాభర్తలు. దాదాపు 21 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒక కుమారుడికి ప్రస్తుతం 18 ఏళ్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు.
Also Read
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
అయితే కొన్ని నెలల క్రితం ఫూల్‌మతికి 26 ఏళ్ల అవధేశ్‌తో పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారినట్లు సమాచారం. ఈ విషయం దంపతుల మధ్య విభేదాలకు దారితీసింది. దాదాపు రెండు నెలల క్రితం ఫూల్మతి అవధేశ్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో ఆమె తిరిగి ఇంటికి వచ్చింది. అయినప్పటికీ కుటుంబంలో విభేదాలు, గొడవలు సద్దుమణగలేదు. ఇంట్లో ప్రతిరోజూ వివాదాలు కొనసాగడం ఇష్టం లేకపోవడంతో బుద్ధిరామ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనతో కలిసి జీవించేందుకు భార్య ఆసక్తి చూపడం లేదని భావించిన ఆయన.. ఆమె కోరుకున్న అవధేశ్‌తో వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో మంగళవారం అస్రఫ్పూర్ గ్రామంలోని శివాలయంలో గ్రామస్తుల సమక్షంలో ఫూల్మతి, అవధేశ్‌ల వివాహం జరిపించాడు. ఈ పెళ్లికి బుద్ధిరామ్ కూడా హాజరయ్యాడు. సంప్రదాయం ప్రకారం వివాహం అనంతరం జరిగే వీడ్కోలు కార్యక్రమంలోనూ పాల్గొన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై బుద్ధిరామ్ మాట్లాడుతూ.. ‘‘ఫూల్మతిని 21 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఆమె నాతో కలిసి జీవించాలనుకోవడం లేదు. ఇంట్లో ప్రతిరోజూ గొడవలు కొనసాగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆమె ఎవరితో కలిసి జీవించాలనుకుంటుందో.. ఆ వ్యక్తితోనే ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. గ్రామస్తుల సమక్షంలో జరిగిన ఈ వివాహం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
- Tags
- husband
- UP
- Uttar Pradesh
- wedding
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!