Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రాకా’ ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్, స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాంటి సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా ‘రాకా’లో షారుఖ్ ఖాన్ కోసం ప్రత్యేక పాత్ర రాశారని, ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించనున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అట్లీ, షారుఖ్ కలిసి రూపొందించిన ‘జవాన్’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత అనుబంధం కారణంగానే ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే చిత్రబృందం ఇప్పటివరకు అలాంటి పాత్రపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, షారుఖ్ గెస్ట్ రోల్ వార్తలు కేవలం సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమయ్యాయి.
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
మరోవైపు ‘రాకా’ షూటింగ్ కూడా వేగంగా కొనసాగుతోంది. గత ఏడాది ముంబైలో ప్రారంభమైన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటివరకు పెద్దగా ఎలాంటి విరామం లేకుండా షూటింగ్ జరుపుకుంటుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ ను ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సంస్థ నిర్వహిస్తోంది. మొదట దుబాయ్‌తో పాటు మరికొన్ని అంతర్జాతీయ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించాలని భావించినప్పటికీ, ఇరాన్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ షెడ్యూళ్లను రద్దు చేసి, మొత్తం షూటింగ్ ను ముంబైలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌పైనే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చిన్నపాటి విరామాలు తప్ప దాదాపు నిరంతరాయంగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. కథానాయిక దీపికా పదుకొణే కూడా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం.
సన్ పిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలనే ప్రణాళికతో అట్లీ ముందుకు సాగుతున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ వాటిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ముంబైలో కొనసాగుతున్న ఈ భారీ షెడ్యూల్ మరో నాలుగు నెలల పాటు సాగనుండగా, 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘రాకా’పై వస్తున్న షారుఖ్ గెస్ట్ రోల్ వార్తలను మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు పుకార్లుగానే పరిగణించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..