Woman flees with lover: ప్రస్తుత కాలంలో వివాహ వ్యవస్థకు గౌరవం లేకుండా పోతోంది. క్షణకాలం సుఖం కోసం చాలా కాపురాలు కూలిపోతున్నాయి. పిల్లలను, భర్తను వదిలేసి కొందరు మహిళలు ప్రియుడితో పారిపోతున్నారు. మరికొందరు ప్రియుడి సాయంతో భర్తను అడ్డుతొలగించుకునేందుకు హత్యలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు ఎక్కువ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా పరిచమైన వ్యక్తులతో స్నేహం, ప్రేమగా మారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Read Also: Onion Juice: ఈ రసం ఒక గ్లాస్ తాగితే చాలు నిమిషాల్లో కడుపు నొప్పి మాయం
ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్‌కి చెందిన ఓ వివాహిత సోషల్ మీడియాలో పరిచమైన వ్యక్తితో పారిపోయింది. ఫేస్‌బుక్‌లో పరిచమైన యూపీ రాయ్‌బరేలికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, ఈ వ్యవహారంలో భర్త నుంచి భారత మొత్తంలో నగదు, బంగారాన్ని దొంగిలించింది. తన భార్యను సదరు వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తప్పుదోవ పట్టించినట్లు భర్త ఆరోపించారు.
వివరాల్లోకి వెళ్తే.. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన అబిరాల్ అనే మహిళ 2017లో పంజాబ్‌లోని మొహాలికి చెందిన వినోద్ కుమార్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత రాయ్‌బరేలీకి చెందిన ఫైజాన్ అహ్మద్‌తో సంబంధాన్ని పెంచుకుంది. డిసెంబర్ 2024లో అబిరాల్ తన భర్తను విడిచిపెట్టి ప్రియుడు అహ్మద్‌ని కలిసేందుకు వెళ్లింది. రెండు రోజుల తర్వాత అతడిని పెళ్లి చేసుకుంది. వివాహం గురించి తెలుసుకున్న భర్త మంగళవారం రాయ్‌బరేలీ పోలీసుల్ని ఆశ్రయించాడు. తన భార్య తన ఫోన్, రూ. 2 లక్షల నగదు, రూ. 5 లక్షల విలువైన వస్తువుల్ని దోచుకుందని ఆరోపించారు. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి ఉండాలని కోరుకుంటుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసుని దర్యాప్తు చేస్తున్నారు.