జమిలిపై మరోసారి కదలిక వచ్చింది. ఇక మంగళవారం ఢిల్లీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరగనుంది.
వక్ఫ్ (సవరణ) చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. కాగా.. సవరణలోని వివిధ అంశాలకు సంబంధించి పిటిషన్లలో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అంశపై తాజాగా వక్ఫ్ చట్టంపై ప్రశ్నలు లేవనెత్తే వారి కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ జాయింట్ కమిటీ (జెపిసి) ఛైర్మన్ జగదాంబికా పాల్ స్పందించారు.ఈ చట్టంలో ఒక్క…
JPC First Meeting: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జమిలి ఎన్నికల బిల్లు అధ్యయనంపై వేసిన జేపీసీ తొలి సమావేశం జనవరి 8వ తేదీన జరగనుంది. ఢిల్లీలోని పార్లమెంట్ అపెక్స్ బిల్డింగ్ లో ఉదయం 11గంటలకు భేటీ కానుంది.
ఒకే దేశం ఒకే ఎన్నికపై జేపీసీ తొలి సమావేశం తేదీ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఒక దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. విపక్షాల గందరగోళం మధ్య ఈ బిల్లును జేపీసీ ఏర్పాటు చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాయిదాలు.. ఆందోళనల కోసం సమయం వృథా అయిపోయింది. మొత్తం మూడు సెషన్లు కలిపి దాదాపు 70 గంటలకు పైగా సమయం కోల్పోయినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై అధ్యయనానికి ఏర్పాటైన జాయింట పార్లమెంటరీ కమిటీకి ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
Jamili Election Bill: దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు తీసుకు వచ్చిన 129వ రాజ్యాంగ సవరణ (వన్ నేషన్- వన్ ఎలక్షన్) బిల్లును ఈరోజు (డిసెంబర్ 20) లోక్‌సభ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది.
జేపీసీ ఏర్పాటు ప్రక్రియ అనేది లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా పర్యవేక్షణలో జరగనుంది. అయితే, స్పీకర్ కు రాబోయే 48 గంటలు చాలా కీలకమైనవిగా చెప్పాలి.. ఎందుకంటే శుక్రవారం (డిసెంబర్ 20) సాయంత్రంలోగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. అప్పటి వరకు జేపీసీలోని సభ్యులు ఎవరెవరు అనేది ఓంబిర్లా ప్రకటించాల్సి ఉంది.
Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లుపై జాయంత్ పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజు వరకు పొడగిస్తూ లోక్‌సభలో గురువారం తీర్మానాన్ని ఆమోదించారు. కమిటీ చైర్మన్, బీజేపీ నేత జగదాంబిక పాల్ లోక్‌భలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో దీనిని ఆమోదించారు.
వక్ఫ్ (సవరణ) బిల్లుపై దర్యాప్తు చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశాయి. తాము జేపీసీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని విపక్ష ఎంపీలు హెచ్చరించారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును పరిశీలించే బాధ్యతను జగదాంబిక పాల్ నేతృత్వంలోని జేపీసీకి అప్పగించిన విషయం తెలిసిందే.