సోషల్ మీడియాలో వాట్సాప్‌కు ప్రత్యేక స్థానం ఉంది… వీడియోలు, ఫొటోలు.. సందేశాలు పంపించే వెసులుబాటు ఉండడమే కాదు.. ఆడియో కాలింగ్, వీడియో కాలింగ్.. గ్రూప్ కాలింగ్.. ఇలా ఎన్నో సదుపాయాలు వాట్సాప్‌లో ఉన్నాయి.. దీంతో, తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానాన్ని చురగొంది వాట్సాప్.. స్మార్ట్‌ఫోన్ ఉంటే.. అందులో వాట్సాప్ ఉండాల్సిందే అనే స్థాయికి వెళ్లిపోయింది.. కొన్ని క్షణాలు పనిచేయకపోయినా.. వాట్సాప్ యూజర్లు అల్లాడిపోతున్నారు. అయితే, భారత దేశంలో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది.. సాంకేతిక సమస్యల వల్లే వాట్సాప్ సేవలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది..
Read Also: Munugode Bypoll: ఫైనల్‌గా గెలిచేది టీఆర్ఎస్సే..!
దేశవ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి.. యాప్ నుంచి సందేశాలు వెళ్లడంలేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.. మెసేజ్ వెళ్లకపోవడం ఓ సమస్య అయితే.. కొన్ని మెసేజ్‌లు వెళ్లినా.. డబుల్ మార్క్.. డబుల్ బ్లూ టిక్ మార్క్ మాత్రం కనిపించడం లేదు.. దీంతో.. అసలు మెసేజ్ అవతలి వ్యక్తికి వెళ్లిందా? లేదా అనే డైలమా నెలకొంది.. అయితే, వాట్సాప్ సేవల్లో అంతరాయానికి సర్వర్ స్టోరేజ్ కానీ, సర్వర్ మార్చడం కానీ, వాట్సాప్‌లో టెక్నికల్‌గా కొన్ని మార్పులు జరిగినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నమాట.. మరోవైపు.. ఇవాళ సూర్యగ్రహణం కూడా ఉన్న నేపథ్యంలో.. వాట్సాప్‌పై గ్రహణం ప్రభావం ఏమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేసేవారు సైతం లేకపోలేదు..