* హైదరాబాద్: 111 జీవోపై నేడు హైకోర్టులో విచారణ.. అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. కొత్త జీవో 69 అమలయ్యే వరకు పాత నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం అఫిడవిట్
* కాకినాడ: నేడు తొండంగి, రావి కంపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దాడిశెట్టి రాజా
* కాకినాడ: రైల్వే ట్రాక్ మరమ్మత్తులు కారణంగా మాధవపట్నం రైల్వే గేటు మూసివేత.. కాకినాడ, సామర్లకోట వెళ్లే వాహనాలు అచ్చంపేట జంక్షన్ మీదగా మళ్లింపు
* నేడు విజయవాడకు కేంద్ర మంత్రి నారాయణస్వామి, పశ్చిమ బైపాస్ రోడ్డు, కృష్ణా నదిపై నిర్మాణంలో వున్న బ్రిడ్జి పరిశీలించనున్న కేంద్ర మంత్రి
* తూర్పుగోదావరి : నేడు హైకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ, అనంతబాబు నేర చరిత్రపై నివేదిక కోరిన హైకోర్టు.. ఈరోజు హైకోర్టు ఆదేశాలు మేరకు నివేదిక సమర్పించనున్న పోలీసులు
* గుంటూరు: నేడు మూడవరోజు రాజధాని రైతుల మహా పాదయాత్ర… దుగ్గిరాల నుండి తెనాలి మీదుగా పెదరావూరు వరకు కొనసాగనున్న రైతుల పాదయాత్ర.
* అనంతపురం : గుంతకల్ పట్టణంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
* నెల్లూరు జిల్లా: నేటి నుంచి వెంకటగిరిలో గ్రామ శక్తి శ్రీ పోలేరమ్మ జాతర. విస్తృతంగా ఏర్పాట్లు చేసిన అధికారులు
* నెల్లూరు నగరం నేతాజీ నగర్ లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* నెల్లూరు: బిట్రగుంటలో జగనన్న లే ఔట్ లను పరిశీలించనున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
* నెల్లూరు: కలిగిరి మండలం కొండూరు లో వైసీపీ సదస్సు.. పాల్గొననున్నఎమ్మెల్యే మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి
* నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గ అధికారులతో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సమీక్ష
* నంద్యాల: నేడు శ్రీశైలంలో మల్లికార్జునస్వామి ఆలయం వెలుపల ఉన్న రత్నగర్భాగణపతి స్వామికి చవితి పూజలు
* విజయనగరం: నేడు పైడితల్లి అమ్మవారి ప్రచార రథం ప్రారంభం… ప్రజాప్రతినిధులు, భక్తులు హాజరుకావాలని ఆలయ ఈవో ప్రకటన