AP Elections 2024 Polling Percentage Announced by Election Comission: అనేక లెక్కలు, అంచనాల అనంతరం చివరికి ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ పోలింగ్ శాతాన్ని 81.86 శాతంగా అధికారికంగా ప్రకటించింది. ఇక ఈసీ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం ఈవీఎంలలో పోలైన ఓట్లు 3,33,40,560 కాగా అందులో పురుషుల ఓట్లు 1,64,30,359, మహిళల ఓట్లు 1,69,08,684 అలాగే ట్రాన్స్జెండర్ల ఓట్లు 1517గా వెల్లడించారు. ఇక ఈవీఎంలలో పోలైన ఓట్లు మొత్తం 80.66 శాతం కాగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లు 4,44,216 (ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగస్తులు ఓట్లు) అని వెల్లడించారు.
MLA House Arrest: కొనసాగుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్..
ఇక హోమ్ ఓట్ ఆప్షన్ ద్వారా పాలైన 53,573 ( వృద్ధులు వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వారి ఓట్లు) ఉన్నాయని ప్రకటించారు. ఈ మొత్తం శాతం 1.20 అని అలా మొత్తంగా ఈవీఎం+పోస్టల్ బ్యాలెట్+ హోమ్ ఓట్ ఆప్షన్ అన్నీ కలిపి 80.66+1.20=81.86 అని వెల్లడించారు. ఇది 2019 ఎన్నికల శాతం తో పోలిస్తే 2.12 శాతం ఎక్కువ అని పేర్కొన్నారు. ఇక ఏపీలో 3,500 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరిగిందని, ఆఖరి పోలింగ్ కేంద్రంలో అర్థరాత్రి 2 గంటలకు పోలింగ్ పూర్తైందని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు. అయితే కొందరు అసెంబ్లీకి ఓటేసి లోక్ సభకు ఓటేయలేదని, 350 స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంలు భద్రపరిచామని ఆయన అన్నారు.
ఇక ఏపీలో పార్లమెంట్ కు 3 కోట్ల 33 లక్షల 4560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఏపీ సీఈఓ ఎంకే మీనా అన్నారు. ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన నిందితులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు తీసుకుని ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తామని అన్నారు. 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ కొనసాగుతుందన్న ఆయన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చన్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరిగిందని, రీపోలింగ్ పై ఎలాంటి వినతులు రాలేదని అన్నారు తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేటలో గొడవలు జరిగాయి.. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు అదనపు బలగాలు పంపాం.. ఆ 4 ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టామని ఏపీ సీఈఓ ఎంకే మీనా అన్నారు.