దేశంలో కరోనా సెకండ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. దాదాపుగా 80 రోజుల తరువాత కనిష్టస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు మరణాల సంఖ్యకూడా క్రమంగా తగ్గుతున్నది. ఈ సమయంలో థర్డ్ వేవ్ గురించి అప్పుడే ఆంధోళనలు మొదలయ్యాయి. థర్డ్ వేవ్ ముప్పు తప్పదని, దానిని ఎదుర్కొనడానికి సిద్దంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో వేవ్‌ను ఎదుర్కొనడానికి అవసరమైన ఆసుపత్రులను, ఆక్సీజన్‌ను సిద్దిం చేసుకుంటున్నాయి రాష్ట్రాలు. వ్యాక్సినేషన్‌ను వేగంగా అందిస్తున్నాయి.
Read: గోవా ఫారెస్టుకి ‘పుష్ప’ రాజ్!
జూన్ 21 వ తేదీన 80 లక్షల మందికి వ్యాక్సినేషన్ ను అందించగా, జూన్ 22 వ తేదీన దేశంలో 54 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్టు కేంద్రం ప్రకటించింది. ఇక, తమిళనాడులో కూడా వ్యాక్సిన్‌ను వేగంగా అందిస్తున్నారు. ఒకవైపు వ్యాక్సిన్ అందిస్తూనే, మరోవైపు ఆసుపత్రులు, ఆక్సీజన్ ప్లాంట్లు సిద్దం చేసుకుంటున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. థర్డ్ వేవ్ అనివార్యమనే హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో దానిని ఎదర్కొనడానికి సదా సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.