Budget 2026-27: కేంద్ర బడ్జెట్.. ధరలు తగ్గనున్న 17 రకాల క్యాన్సర్ మందుల ఇవే..
- క్యాన్సర్ రోగులకు బడ్జెట్‌లో ఉపశమనం..
- 17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget 2026-27: కేంద్ర బడ్జెట్ 2026-27లో క్యాన్సర్ రోగులకు ఉపశమనం ఇచ్చింది. 17 రకాల క్యాన్సర్ ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించింది. దీని వల్ల క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి చికిత్స మరింత చౌకగా మారనుంది. క్యాన్సర్ చికిత్సకు వాడే డ్రగ్స్ తరుచుగా విదేశాల నుంచి భారత్‌కు వస్తుంటాయి. దిగుమతి సుంకాలు ఔషధాల ధరల్ని మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మందులపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించడం ద్వారా రోగులకు మెరుగైన వైద్యం,చికిత్స అందే వీలు కలిగింది.
బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ఇతర అరుదైన క్యాన్సర్ చికిత్సల్లో ఉపయోగించే మందులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ మందులు చాలా వరకు ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, సెల్ ఆధారిత చికిత్సల్లో కీలకంగా ఉన్నాయి.
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
కస్టమ్స్ సుంకం మినహాయింపు ఏమిటి.?
కస్టమ్స్ సుంకం అనేది భారత్ దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను. మందులపై ఈ సుంకాలను తొలగించినప్పుడు, అది వాటి ల్యాండింగ్ ధరను నేరుగా తగ్గిస్తుంది. దిగుమతిదారులు లేదా ఆస్పత్రులు ఇకపై వాటికి ప్రాథమిక కస్టమ్స్ సుంకం చెల్లించాల్సిన అవసరం లేదు. రోగులకు తక్కువ ధరకు ఆ మందులు లభిస్తాయి.
ధరలు తగ్గే 17 రకాల మందులు ఇవే:
1. రిబోసిక్లిబ్(Ribociclib)
2. అబెమాసిక్లిబ్(Abemaciclib)
3. టాలికాబ్టాజీన్ ఆటోల్యూసెల్(Talycabtagene autoleucel)
4. ట్రెమెలిముమాబ్(Tremelimumab)
5. వెనెటోక్లాక్స్(Venetoclax)
6. సెరిటినిబ్(Ceritinib)
7. బ్రిగాటినిబ్(Brigatinib)
8. డారోలుటామైడ్(Darolutamide)
9. టోరిపాలిమాబ్(Toripalimab)
10. సెర్ప్లులిమాబ్(Serplulimab)
11. టిస్లెలిజుమాబ్(Tislelizumab)
12. ఇనోటుజుమాబ్ ఓజోగామిసిన్( Inotuzumab ozogamicin)
13. పొనాటినిబ్(Ponatinib)
14. ఇబ్రూటినిబ్( Ibrutinib)
15. డాబ్రాఫెనిబ్(Dabrafenib)
16. ట్రామెటినిబ్(Trametinib)
17. ఇపిలిముమాబ్(Ipilimumab)
తాజావార్తలు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!