గోవా ఫారెస్టుకి ‘పుష్ప’ రాజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సుకుమార్ బన్నీని గతంలో ఎన్నడూ చూడని విధంగా కళ్ళు చెదిరే సీన్స్ ప్లాన్ చేశారని, ఇందుకోసం సుకుమార్ తన క్రియేటివిటీకి పదును పెట్టారని తెలుస్తోంది. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ మూవీ రూపొందిస్తున్నారు సుకుమార్. పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగు తిరిగి మొదలుకాబోతుంది. తదుపరి షెడ్యూల్ ను ‘గోవా’లో ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇదివరకే గోవాలో లొకేషన్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఇంట్రడక్షన్స్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-