Bengaluru Murder Case: “మహాలక్ష్మీతో విసిగిపోయాను”.. నిందితుడి సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు..
- మహాలక్ష్మీ హత్యలో సంచలన విషయాలు..
- ఇప్పటికే నిందితుడు ముక్తి రంజన్ ఆత్మహత్య..
- సూసైడ్ నోట్‌లో తానే చంపానని చెప్పిన నిందితుడు..
- మహాలక్ష్మీతో విసిగిపోయే ఈ హత్య చేశాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Murder Case: బెంగళూర్ మహాలక్ష్మీ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహాలక్ష్మీని చంపేసి 59 ముక్కలుగా చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన ముక్తి రంజన్ రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయేందుకు ముందు అతను సూసైడ్ నోట్ రాశాడు. దీంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘సెప్టెంబర్ 03న తన లవర్ మహాలక్ష్మీని చంపాను’’ అని లేఖలో పేర్కొన్నాడు. ఆమె ఇంటికి వెళ్లి హత్య చేసినట్లు చెప్పాడు. ‘‘ నేను ఆమె ప్రవర్తనతో విసిగిపోయాను. నేను ఆమెతో వ్యక్తిగత విషయాలపై గొడవపడగా, మహాలక్ష్మీ నాపై దాడి చేసింది. కోపంతో ఆమెను చంపాను’’అని లేఖలో పేర్కొన్నాడు.
Read Also: Emergency Movie: కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ విడుదలకు మార్గం సుగమం.. కొన్ని సీన్స్ కట్
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
‘‘మహాలక్ష్మీని చంపి, ఆమె శరీరాన్ని 59 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో ఉంచాను. ఆమె ప్రవర్తనతో విసిగిపోయి ఈ పనిచేశాను’ అని తన డైరీలో పేర్కొన్నాడు. ఒడిశా భద్రక్ జిల్లాకు చెందిన రాయ్ బుధవారం తన సొంతూరుకి సమీపంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయ్ బుధవారం పాండి గ్రామానికి వచ్చి, ఇంట్లోని స్కూటర్ తీసుకుని బయటకు వెళ్లాడు, ఆ తర్వాత ఉరేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు.
సంచనంగా మారిన ఈ కేసులో ముక్తి రంజన్‌ని పట్టుకునేందుకు నాలుగు పోలీస్ బృందాలు ఒడిశాకు వెళ్లాయి. అనుమానిత వ్యక్తి సెప్టెంబర్ 1 నుంచి పనికి రావడం మానేశాడు. మహాలక్ష్మీ కూడా సెప్టెంబర్ 1 నుంచి పనికిరావడం లేదు. సెప్టెంబర్ 2-3 మధ్య మహాలక్ష్మీ హత్య జరిగినట్లు తేలింది. మహాలక్ష్మీ పనిచేస్తున్న చోట టీమ్ లీడ్‌గా నిందితుడు పనిచేస్తున్నాడు. మహాలక్ష్మీ, ముక్తి ఇద్దరూ ఓ గార్మెంట్ షాపులో పనిచేస్తున్నారు, ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. సెప్టెంబర్ 2న ఆమె వీకాఫ్ తీసుకుంది. ఎప్పటిలాగే ముక్తి రంజన్ రాయ్ ఆమె నివాసానికి వచ్చాడు. మహాలక్ష్మీ తనను పెళ్లి చేసుకోమని ముక్తిని బలవంతం చేయడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఇదే చివరకు ఆమె హత్యకు కారణమైంది. అప్పటికే పెళ్లయిన మహాలక్ష్మీకి భర్త, ఓ పాప కూడా ఉంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఓ ఫ్లాట్లో ఉంటోంది. శనివారం బాధితురాలు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో యజమాని మహాలక్ష్మీ తల్లి, సోదరికి ఫోన్ చేయడంతో, వారు ఇంటికి వచ్చి చూడటంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!