చిన్న వివాదం ఒక వ్యక్తి హత్యకు కారణమైంది. బెంగళూర్‌లోని ఒక ఆఫీసులో ‘‘ లైట్లు’’ ఆర్పే విషయంలో ఏర్పడిన వివాదం శనివారం తెల్లవారుజామున హత్యకు దారితీసింది. చిత్రదుర్గకు చెందిన 41 ఏళ్ల మేనేజన్‌ను భీమేష్ బాబును అతడి సహోద్యోగి డంబెల్‌తో కొట్టి చంపాడు. ఈ సంఘటన గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డేటా డిజిటల్ బ్యాంక్ కార్యాలయంలో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ కంపెనీ సినిమా షూటింగ్ వీడియోలను స్టోర్ చేస్తుంది.
Bengaluru: బెంగళూర్‌లో దారుణం ఘటన జరిగింది. నగరంలోని అనేకల్ ప్రాంతంలో 28 ఏళ్ల వ్యక్తి తన భార్య తల నరికి, తలతో పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. శంకర్ అనే నిందితుడు 26 ఏళ్ల తన భార్య మానస వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంగా ఈ భయానక చర్యకు పాల్పడ్డాడు.
సౌరభ్ హత్య కేసుతో పాటు ఔరయ్య, బెంగళూరు హత్యలు కూడా దేశంలో చర్చనీయాంశమవుతున్నాయి. మూడు కేసుల్లోనూ హత్యల సరళి దాదాపు ఒకేలా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సౌరభ్ భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్‌తో కలిసి అతన్ని హత్య చేశారు. అదేవిధంగా, ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యలో వివాహం అయిన 15 రోజులకే తన భర్త దిలీప్‌ను హత్య చేయడానికి ప్రగతి కుట్ర పన్నింది.
Bengaluru Shocker: బెంగళూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ, ఓ టెక్కీ తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఆర్‌ఎంవీ 2వ స్టేజ్ ప్రాంతంలోని అద్దెకు ఉంటున్న సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్, తన కుటుంబంతో సహా శవాలుగా కనిపించారు. హత్యా-ఆత్మహత్య అనే అనుమానంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Bengaluru Murder Case: బెంగళూర్ మహాలక్ష్మీ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహాలక్ష్మీని చంపేసి 59 ముక్కలుగా చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన ముక్తి రంజన్ రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు
Bengaluru Murder Case: బెంగళూర్ మహాలక్ష్మి(29) హత్య కేసులో సంచలనం నెలకొంది. ఈ హత్యలో కీలక నిందితుడిగా భావిస్తున్న సహోద్యోగి ముక్తి రంజన్ రాయ్ బుధవారం ఒడిశాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హత్య అనంతరం బెంగళూర్ నుంచి ఒడిశాకు పారిపోయాడు. విచారణలో భాగంగా రాయ్‌ని పట్టుకునేందుకు బెంగళూర్ పోలీసులు ఒడిశాకు వెళ్లారు. అయితే, వారు అతడిని అదుపులోకి తీసుకునే ముందే రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.