Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి నేపాలి గ్యాంగ్ కలకలం సృష్టించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ రిడ్జ్ విల్లాస్‌లో జరిగిన భారీ చోరీ నగరంలో సంచలనం సృష్టించింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పనిచేస్తున్న నేపాలి దంపతులు కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు, నగదుతో పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హిల్ రిడ్జ్ విల్లాస్‌లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త ప్రకాష్ ఇంట్లో నెల రోజుల క్రితమే నేపాల్‌కు చెందిన కమల్, విమలా దంపతులు పనికి చేరారు. వ్యాపార అవసరాల నిమిత్తం ప్రకాష్ కొద్ది రోజుల క్రితం ముంబైకి వెళ్లగా, కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో లేకపోవడంతో ఈ దంపతులు పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రకాష్ కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా.. ఇంట్లో పనిచేస్తున్న నేపాలి దంపతులు కనిపించలేదు.
Also Read
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
- Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
అదే సమయంలో ఇంట్లోని రెండు చోట్ల భద్రపరిచిన బంగారు ఆభరణాలు, నగదు, వెండి వస్తువులు, వజ్రాలు, వజ్రాభరణాలు మాయమైనట్లు గుర్తించారు. పూజా గదిలోని విగ్రహానికి అలంకరించిన బంగారు గొలుసుతో పాటు ఇతర విలువైన వస్తువులు కూడా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. చోరీకి పాల్పడిన నేపాలి దంపతులే నగలతో పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో నాలుగు బృందాలను నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు పంపినట్లు సమాచారం. మరోవైపు ఈ దంపతులను ఉద్యోగంలోకి తీసుకువచ్చిన వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చోరీకి గురైన బంగారం, వజ్రాభరణాలు, నగదు విలువపై ఇంకా స్పష్టత రాలేదని, పూర్తి లెక్కలు తేలిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, పరారీలో ఉన్న దంపతులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!